రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఘన స్వాగతం
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు హైదరాబాద్‌లో ఘనస్వాగతం లభించింది. భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, జీహెచ్‌ఎంసీ మేయర గద్వాల విజయలక్ష్మి, ఎంపీలు ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు, ధర్మపురి అర్వింద్, సీఎస్ శాంతికుమారి, డీజీపి జితేందర్, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులలోపాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరయ్యారు. అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు తరలివెళ్లారు. రాష్ట్రపతి రెండ్రోజుల నగర పర్యటనకు వచ్చిన నేపథ్యంలో గగనతలంలో ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ సీవీ ఆనంద్ ఆదేశాలిచ్చారు.