ప్రియాంకా గాంధీ ఘన విజయం
వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికలో భారీ విజయాన్ని ప్రియాంకా గాంధీ దక్కించుకున్నారు. ఈ స్థానంలో తన సమీప అభ్యర్థిపై 4.04లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజార్టీని ప్రియాంక దాటేశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామాతో కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానం ఖాళీ అయింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ పోటీ చేసిన ప్రియాంక గాంధీ మొదటి నుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఇక్కడి ప్రత్యర్థులైన సీపీఐ, బీజేపీ అభ్యర్థులు పోటీ ఇవ్వలేకపోయారు.తొలి అడుగులోనే ఆమె బంపర్ మెజార్టీ సాధించారు. తన సమీప అభ్యర్థి బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్పై 3.82 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. రాహుల్ గాంధీ మెజార్టీని ఆమె బీట్ చేసేశారు. రాహుల్ మెజార్టీని ఆమె దాటేశారు.