లోక్‌సభ ఎంపీగా ప్రమాణం చేసిన ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఇటీవల కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆమె, ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. సోదరుడు, ఎంపీ రాహుల్ గాందీ, ఇతర నేతలు వెంట రాగా, కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే కసావు చీర ధరించి ప్రియాంక సభకు వచ్చారు. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బ్లిరా కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యాంగ ప్రతిని చేతబూని ఆమె ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రం చేసిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తొలి అడుగులోనే భారీ విజయాన్ని నమోదు చేశారు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై 4,10,931 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఇదే స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన (3.64 లక్షలు) మెజార్టీని ఆమె అధిగమించారు. ఎంపీ హోదాలో మొదటిసారి లోక్‌సభలోకి అడుగుపెట్టారు. వయనాడ్‌లో విజయంతో నెహ్రూ`గాంధీ కుటుంబంలో దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించిన మూడో వ్యక్తిగా ప్రియాంక గుర్తింపు పొందారు.