వికలాంగులకు ప్రతీ ఒక్కరూ సేవ చేయాలి - ప్రియాంక వల్లే పల్లి
ఈరోజు హైదరాబాదులో చంపాపేట్ లోని ప్రభుత్వ మహిళల వికలాంగుల సదనంలో 30 వీల్ ఛైర్లును దివ్యాంగుల మహిళలకు క్వాలిటీ మాట్రిక్స్ సంస్థ ప్రతినిధి శ్రీమతి ప్రియాంక వాల్లే పల్లి గారు అందజేశారు. వికలాంగులకు సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. సుమారుగా రెండు లక్షలు రూపాయల ఖర్చుపెట్టి దివ్యాంగుల మహిళలకు అందజేసిన ప్రియాంక వాలేపల్లి గారిని స్థానిక కార్పొరేటర్ బిజెపి రాష్ట్ర నాయకులు వంగ మసూద్ రెడ్డి గారు సత్కరించి అభినందించారు. అఖిలభారత వికలాంగులకు ప్రతినిధి కొల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ అమెరికాలో ఉండి ఉన్నత స్థానానికి ఎదిగి పుట్టిన ప్రాంతానికి సేవ చేయడం అదృష్టమని అందులో ప్రియాంక గారు వారి భర్త శశికాంత్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ముఖ్యంగా దివ్యాంగులకు చేయడం చాలా సంతోషమని అన్నారు.
Tags :