న్యూయార్క్‌లోని బంగ్లా కాన్సులేట్‌పై దాడి
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో కొన్ని నెలల క్రితం శాంతియుతంగా మొదలైన నిరసనలు తీవ్ర పరిణామాలకు దారి తీశాయి. చివరకు దేశ ప్రధాని గద్దెదిగాల్సి వచ్చింది. కాగా అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న బంగ్లాదేశ్ కాన్సులేట్‌పై నిరసనకారులు దాడికి దిగారు. లోపలికి ప్రవేశించి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా గోడపై మాజీ ప్రధాని షేర్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రపటాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. కాన్సుల్ జనరల్ నజ్ముల్ హుదాతో వాదనకు దిగారు.
Tags :