ASBL NSL Infratech
facebook whatsapp X

తెలంగాణలో రూ.500 కోట్లతో .. పీఎస్‌ఆర్‌ పెట్టుబడులు

తెలంగాణలో రూ.500 కోట్లతో .. పీఎస్‌ఆర్‌ పెట్టుబడులు

తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్‌, ఐటీ, ఇతర ఉత్పత్తుల కోసం రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పీఎస్‌ఆర్‌ పరిశ్రమ ముందుకొచ్చింది. దీంతో రానున్న మూడేళ్లలో 700 మందికి ఉపాధి లభిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. అమెరికా టెలికాం దిగ్గజం మైక్రోలింక్‌ నెట్‌వర్క్స్‌ నుంచి సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి పీఎస్‌ఆర్‌ ఇండ్రస్టీస్‌ ఒప్పందం చేసుకుందని ఆయన తెలిపారు. సచివాలయంలో మైక్రోలింక్‌ గ్లోబల్‌ ప్రతినిధులు, పీఎస్‌ఆర్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ శ్రీరంగారావు మంత్రి శ్రీధర్‌ బాబుతో భేటీ అయ్యారు. 

డేటా ట్రాన్‌మిషన్‌, నెట్‌వర్కింగ్‌ కేబుల్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, మల్టీలెవల్‌ పార్కింగ్‌ మిషన్ల ఉత్పత్తిలో మైక్రోలింక్‌ నెట్‌వర్క్స్‌  గ్లోబల్‌ లీడర్‌గా ఉంది. ఇటీవల మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటనలో మైక్రోలింక్‌ నెట్‌వర్క్‌ యాజమాన్యం, పీఎస్‌ ఆర్‌ ఇండస్ట్రీస్‌ ప్రతినిధులతో చర్చించారు. వారితో తానూ జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని, సాంకేతికత బదిలీకి మైక్రోలింక్‌ అంగీకరించిందని తెలిపారు. ఇప్పుడా  కంపెనీ టెక్నాలజీతో పీఎస్‌ఆర్‌ ఇండస్ట్రీస్‌ తెలంగాణలో పెట్టుబడులుకు ముందుకొచ్చిందని మంత్రి పేర్కొన్నారు.  రాష్ట్రంలో నైపుణ్యం ఉన్న సిబ్బందికి కొరత లేదని వివరించారు. ఈ సమావేశంలో పీఎస్‌ఆర్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ శ్రీరంగారావు, డైరెక్టర్‌ నమ్యుత, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ధర్మరాజు చక్రవరం, మైక్రోలింక్‌ గ్లోబల్‌ ప్రతినిధులు డా.డెనిస్‌ మొటావా, సియాన్‌ ఫిలిప్స్‌, జో జోగ్బి, సుమాన్‌ వల్లపురెడ్డి, అశోక్‌ పెర్సోత్తమ్‌ పాల్గొన్నారు. 
 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :