ASBL Koncept Ambience
facebook whatsapp X

డ‌బుల్ ఇస్మార్ట్ పై పూరీ కేర్

డ‌బుల్ ఇస్మార్ట్ పై పూరీ కేర్

ఒక సినిమా తీయాలంటే ఎంతో టైమ్ కావాలి. కానీ పూరీ జ‌గ‌న్నాధ్ మాత్రం ఎప్పుడు సినిమా అనౌన్స్ చేస్తాడో ఎప్పుడు షూటింగ్ పూర్తి చేస్తాడో ఎప్పుడు రిలీజ్ చేస్తాడో అన్న‌ట్లే త‌న సినిమాల‌ను తీస్తుంటాడు. రెండు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసి, నాలుగు నెల‌లు మిగిలిన వ‌ర్క్స్ మొత్తం మీద సినిమాకు ఆరు నెల‌లు టైమ్ తీసుకుంటాడంతే. అదంత ఈజీ కాదు. కానీ పూరీ ఈ విష‌యంలో చాలా ఎక్స్‌ప‌ర్ట్. పూరీ ప‌నిత‌నాన్ని మెచ్చి రాజ‌మౌళి అంత‌టి డైరెక్ట‌ర్ త‌న ద‌గ్గ‌ర అసిస్టెంట్ గా జాయిన్ అవుతాన‌న్నాడంటే పూరీ గొప్ప‌త‌నం ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. పూరీ కెరీర్ మొద‌లు పెట్టిన దగ్గ‌ర నుంచి ఇస్మార్ట్ శంక‌ర్ వ‌ర‌కు ఇదే శైలిలో వేగంగా సినిమాలు చేస్తూ వ‌చ్చాడు.

కానీ వ‌రుస వైఫ‌ల్యాలు పూరీని మార్చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం పూరీ, రామ్ తో డ‌బుల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా మొద‌లై చాలా కాల‌మైంది. రెండు రోజుల ముందుగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. పూరీ త‌ను తీసిన ఏ సినిమాకూ ఇంత ఎక్కువ టైమ్ తీసుకోలేదు. మొద‌టిసారి పూరీ ఎక్కువ టైమ్ తీసుకుని చేసిన సినిమా ఏదంటే డ‌బుల్ ఇస్మార్ట్ అనే చెప్తారు. దీన్ని బ‌ట్టే పూరీ డ‌బుల్ ఇస్మార్ట్ విష‌యంలో ఎంత జాగ్ర‌త్త తీసుకున్నాడ‌నేది అర్థ‌మ‌వుతుంది. డ‌బుల్ ఇస్మార్ట్ హిట్ అవ‌డం అటు పూరీకి, ఇటు రామ్ కి ఎంతో అవ‌స‌రం.  
 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :