పుష్ప2: నచ్చిన భాషలో చూసే సౌలభ్యం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) హీరోగా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప2 ది రూల్(Pushpa2 the rule) సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప2 పై షూటింగ్ దశ నుంచే భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. టీజర్ తో మొదలుపెట్టి ఈ సినిమా నుంచి ఏ కంటెంట్ రిలీజైన అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
పుష్ప2 కు ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. పాట్నా ఈవెంట్ తో మొదలుపెట్టిన పుష్ప2 ప్రమోషన్స్ తమిళనాడు, కేరళ, ముంబైల్లో భారీ ఎత్తున సక్సెస్ అయ్యాయి. దేశమంతా పుష్ప2 కోసం వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ఎవరు ఎక్కడ సినిమా చూసినా ఆడియన్స్ కు ఇబ్బంది లేకుండా ఓ యాప్ ను తీసుకొచ్చారు నిర్మాతలు.
పుష్ప2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 12వేల స్క్రీన్స్ లో రిలీజవుతుందని, భాషా సౌలభ్యం కోసం సినీ డబ్స్ అనే యాప్ ను తీసుకొచ్చామని, ఈ యాప్ లో ఆరు భాషల్లో ఏ భాష కావాలంటే ఆ భాషలోనే ఆడియన్స్ సినిమాను చూడొచ్చని మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers)నిర్మాత రవి(Ravi) తెలిపారు. దీని ద్వారా ఆడియన్స్ ను భాష పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా సినిమాను ఆస్వాదించే అవకాశం కల్పించామన్నారు. మొత్తానికి పుష్ప2 ప్రతీ విషయంలోనూ ప్రేక్షకుల మనసుల్ని దోచేస్తుంది.