పుష్ప2కు గన్స్ తో వెళ్తామంటున్న బన్నీ ఫ్యాన్స్
దేశం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప2(Pushpa2) రిలీజ్ కు ఇంకా 20 రోజులు కూడా టైమ్ లేదు. రేపు పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను చాలా భారీగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ ను బాలీవుడ్ వర్గాలకు సైతం మతిపోయేలా ప్లాన్ చేస్తున్నారట మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers). గతంలో ఏ సినిమాకూ ఇలాంటి ప్రమోషన్స్ చూడలేదనే రీతిలో పుష్ప2కు ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నారట.
ఇతర దేశాల థియేటర్లలో కూల్ డ్రింక్, పాప్ కార్న టబ్స్ తో స్టార్ట్ చేసి తెలుగు రాష్ట్రాల్లో దొరికే బియ్యం సంచులపై వరకు ప్రతీ దానిపై పుష్ప2 బొమ్మే కనిపిస్తోంది. భారీ ఎత్తున హోర్డింగులు కూడా ప్లాన్ చేస్తున్నారు. బీహార్ లో ఉన్న బన్నీ ఫ్యాన్స్ అయితే పుష్ప2 ప్రీమియర్లకు తుపాకులతో వెళ్తామని, బుల్లెట్లు బయట గాల్లో కాల్చి తర్వాత లోపలకు వెళ్తామని చెప్తున్నారంటే పుష్ప2 డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక బన్నీ(Bunny)కి మంచి క్రేజ్ ఉన్న కేరళలో అయితే వారం కిందటే పుష్ప2 బెనిఫిట్ షో టికెట్స్ అమ్మడం మొదలుపెట్టారు. రిలీజ్ కు రెండు వారాల ముందే క్రేజ్ ఇలా ఉందంటే ఇక దగ్గర పడేకొద్దీ ఈ సినిమా గురించి ఇంకెన్ని విశేషాలు వినాల్సి వస్తుందోనని అందరూ ఎగ్జయింట్ గా ఉన్నారు. ఏరియాల వారీగా భారీ రేట్లకు పుష్ప2 రైట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే పుష్ప2 ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో ఊహించడమే కష్టంగా ఉంది.