ASBL Koncept Ambience
facebook whatsapp X

పుష్ప‌2 కొత్త అప్డేట్

పుష్ప‌2 కొత్త అప్డేట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న పుష్ప‌2 సినిమా కోసం దేశ‌మంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమా స‌క్సెస్ ఈ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాల‌ను పెంచేసింది. రిలీజ్ లేట్ అయినా స‌రే ప‌బ్లిక్ అటెన్ష‌న్ మాత్రం ఇప్ప‌టికీ అంతే ఉంది. పుష్ప‌2 నుంచి వ‌చ్చిన రెండు సాంగ్స్ సూప‌ర్ హిట్ అవ‌డంతో ఈ సినిమా పుష్ప‌ని మించి ఉంటుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ సినిమా స్క్రిప్ట్ ప‌రంగా సుకుమార్ చాలా మార్పులు చేశాడ‌ట‌. అందుకే షూటింగ్ బాగా లేట‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. డిసెంబ‌ర్ 6న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సీక్వెన్స్‌ను తెర‌కెక్కించిన‌ట్లు తెలుస్తోంది. ఓ వైపు షూటింగ్ జ‌రుగుతుండ‌గానే ఎడిటింగ్ వ‌ర్క్స్ కూడా సుకుమార్ పూర్తి చేసే ప‌నిలో ఉన్నార‌ట‌.

పుష్ప సినిమాలోని స్పెష‌ల్ సాంగ్ ఊ అంటావా లాంటి పాట‌ను పుష్ప‌2లో కూడా ఒక‌టి ప్లాన్ చేశార‌ట‌. అక్టోబ‌ర్ లేదా నవంబ‌ర్ లో ఈ సాంగ్ షూటింగ్ జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. ఈ పాటలో న‌టించ‌డానిని స్టార్‌ను ఎంపిక చేయ‌డంలో ఇప్పుడు సుకుమార్ టీమ్ దృష్టి సారించింద‌ట‌. అయితే ఈ సాంగ్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తార‌నే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ముందుగానే సాంగ్ ని రిలీజ్ చేస్తారా లేదా షూట్ అయ్యాక డ్యాన్స్ వీడియో ఫుటేజ్ తో సాంగ్ ను రిలీజ్ చేస్తారా అనేది తెలియాలంటే వెయిట్ చేయాలి.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :