ASBL NSL Infratech
facebook whatsapp X

పుష్ప‌2 కొత్త రికార్డులు

పుష్ప‌2 కొత్త రికార్డులు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప‌2. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. వాస్త‌వానికి పుష్ప‌2 ఆగ‌స్ట్ 15న రిలీజ్ కావాల్సింది కానీ షూటింగ్ లేట‌వ‌డం వ‌ల్ల సినిమాను డిసెంబ‌ర్ 6కి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఎన్నో సంచ‌నాలు సృష్టిస్తోంది. తాజాగా పుష్ప‌2కు ఓటీటీ, శాటిలైట్ మ‌రియు ఆడియో రైట్స్ కోసం భారీ డీల్ కుదిరిన‌ట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ నిర్మాత కెఇ జ్ఞాన‌వేల్ రాజా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పుష్ప‌2 హిందీ వెర్ష‌న్ నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ రూ.260 కోట్లు ప‌లికిన‌ట్లు వెల్ల‌డించాడు. ఆయ‌న మాట‌ల్ని బ‌ట్టి చూస్తే ఇండియాలో ఇదే హ‌య్యెస్ట్ నాన్ థియేట్రిక‌ల్ డీల్ అని చెప్పాలి.

కెజిఎఫ్2 కంటే పుష్ప‌2 ఎక్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌డుతుంద‌ని, నార్త్ ఇండియ‌న్ మార్కెట్ లో పుష్ప ది రూల్ రికార్డులు బ్రేక్ చేస్తుంద‌ని, ఈ సినిమా బాక్సాఫీస్ ను రూల్ చేస్తుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డుతున్నారు.  పుష్ప ఇచ్చిన స‌క్సెస్ ను దృష్టిలో పెట్టుకుని సుకుమార్ ఈ సినిమాను మ‌రింత గ్రాండ్ గా ఎంతో జాగ్ర‌త్త‌గా రూపొందిస్తున్నాడు.

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :