ASBL Koncept Ambience
facebook whatsapp X

ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే మ‌తి పోగొడుతున్న పుష్ప‌2

ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే మ‌తి పోగొడుతున్న పుష్ప‌2

రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ పుష్ప2(Pushpa2) పై ఆడియ‌న్స్ తో పాటూ ట్రేడ్ వ‌ర్గాల్లో కూడా అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. ఇంకా సినిమా నుంచి క‌నీసం ట్రైల‌ర్, ఐటెం సాంగ్ కూడా రాలేదు. కానీ పుష్ప‌2 మాత్రం అస్స‌లు త‌గ్గేదేలే అంటూ అస‌లైన అరాచ‌కం చూపిస్తున్నాడు. పుష్ప‌1(Pushpa1) టైమ్ లో హిందీ వెర్ష‌న్ యూట్యూబ్ లో వ‌స్తే చాల‌న్న బాలీవుడ్ నిర్మాత మాట‌ను త‌ప్ప‌ని ఋజువు చేసి ఇప్పుడు పుష్ప‌2 థియేట్రిక‌ల్ రైట్స్ కోసం నార్త్ వాళ్లు కొట్టుకునేలా చేయ‌డం ఒక్క ఈ సినిమాకే చెల్లింది.

పుష్ప‌2 ప్రీ రిలీజ్ బిజినెస్ నుంచే రూ.1000 కోట్ల మార్కు దాటింద‌నే వార్త ఇప్పుడు అన్ని చోట్లా వినిపిస్తోంది. నిర్మాత‌లు అధికారికంగా చెప్ప‌క‌పోయినా లీక‌వుతున్న సోర్స్ నుంచి వ‌స్తున్న నెంబ‌ర్స్ మ‌తి పోగ‌డొతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రిక‌ల్ రైట్స్ రూ.220 కోట్ల వ‌ర‌కు బిజినెస్ అయింద‌నే టాక్ ఇప్ప‌టికే బ‌య‌టికొచ్చింది.

నార్త్ వెర్ష‌న్ రూ.200 కోట్లు, త‌మిళ‌నాడు రూ.50 కోట్లు, కర్ణాట‌క రూ.30 కోట్లు, కేర‌ళ రూ.20 కోట్లు, ఓవ‌ర్సీస్ రూ.120 కోట్ల వ‌ర‌కు థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింద‌ని ట్రేడ్ టాక్. అంటే మొత్తం క‌లిపి రూ.640 కోట్లు. ఇవి కాకుండా నాన్ థియేట్రిక‌ల్ చూస్తే ఓటీటీకి రూ.275 కోట్లు, ఆడియో రైట్స్ రూ.65 కోట్లు, శాటిలైట్ అన్ని భాష‌లు క‌లిపి రూ.85 కోట్ల వ‌ర‌కు బిజినెస్ జ‌రిగింద‌ని టాక్. అంటే మొత్తం క‌లిపితే రూ.1065 కోట్లు. ఇవి క‌రెక్ట్ లెక్క‌లు కాక‌పోయినా క్రేజ్ ను చూస్తే మాత్రం నిజ‌మ‌య్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి. బాక్సాఫీస్ వ‌ద్ద పుష్ప‌2 రూ. 1000 కోట్లు వ‌సూలు చేస్తే మాత్రం అది మ‌రో రికార్డ‌వ‌డం ఖాయం. 

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :