ASBL Koncept Ambience
facebook whatsapp X

పుష్ప‌2 కోసం భారీ ప్ర‌ణాళిక‌లు

పుష్ప‌2 కోసం భారీ ప్ర‌ణాళిక‌లు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(sukumar) కాంబినేష‌న్ లో వ‌స్తున్న పుష్ప‌2(Pushpa2) సినిమా ముందు అనుకున్న‌ట్లు డిసెంబ‌ర్ 6న కాకుండా ఒక రోజు ముందుగా అంటే డిసెంబ‌ర్ 5న రిలీజ్ కావ‌డం ఆల్మోస్ట్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్లే. ఇప్ప‌టికే ఈ మేర‌కు డిస్ట్రిబ్యూట‌ర్లకు స‌మాచారం కూడా అందింద‌ని టాక్. మ‌రికొన్ని రోజుల్లో అధికారిక ప్ర‌క‌ట‌న ఇవ్వ‌నున్నారు.

దేవ‌ర(Devara) లానే పుష్ప‌2కు కూడా అర్థ‌రాత్రి ఒంటిగంటకు ప్రీమియ‌ర్లు ఉంటాయ‌ని చెప్ప‌డంలో ఎలాంటి డౌట్ అక్క‌ర్లేదు. ఎన్టీఆర్(NTR) ఫ్యాన్స్ చేసిన ర‌చ్చ కంటే ఎక్కువగా ర‌చ్చ చేయ‌డానికి బ‌న్నీ(Bunny) ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల‌తో పాటూ కేర‌ళలో కూడా ఎక్కువ థియేట‌ర్ల‌లో స్పెష‌ల్ షోలు వేయ‌డానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

అంతేకాదు ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని నార్త్ లో డిసెంబ‌ర్ 4 రాత్రి 9 గంట‌ల నుంచే షోలు వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచ‌న‌లో కూడా నిర్మాత‌లున్నార‌ట‌. ఈ మేర‌కు డెసిష‌న్ తీసుకోవాల్సి ఉంది. మొత్తానికి క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో పుష్ప‌2 కోసం డిస్ట్రిబ్యూట‌ర్లు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి ఎలాంటి టెన్ష‌న్ ఉండ‌దు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ విష‌యంలో ఏ స‌మ‌స్యా ఉండ‌దు. అంతేకాదు ఈ సినిమాకు పోటీ కూడా పెద్ద‌గా లేదు. రూ.1000 కోట్ల టార్గెట్ తో రిలీజ‌వుతున్న పుష్ప‌2కు మంచి టాక్ వ‌స్తే టార్గెట్ ను ఈజీగా రీచ్ అవుతాడు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :