పుష్ప2 రన్ టైమ్ కు హిట్ సెంటిమెంట్
మామూలుగా ఏ సినిమా రన్ టైమ్ అయినా రెండున్నర గంటల నుంచి మూడు గంటల మధ్యలో ఉండటం కామన్. ఆడియన్స్ కూడా ఈ రన్ టైమ్‌కే అలవాటు పడ్డారు. ఇంతకంటే ఎక్కువ నిడివి ఉంటే ప్రేక్షకులు ఓపిక కూడా చూడలేరనే భావన చాలా మందిలో ఉంది. ఎక్కువ రన్ టైమ్ ఉంటే థియేటర్ల నిర్వహణకు కూడా భారమవుతుంది కాబట్టి మేకర్స్ మూడు గంటలకు లోపే సినిమా లెంగ్త్ ను ప్లాన్ చేసుకుంటారు.
కానీ కొందరు మాత్రం రన్ టైమ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవరు. తాము చెప్పాలనుకున్నది అసలు రాజీ పడకుండా చెప్పాలని చూస్తారు. ఇప్పుడు ఆ కోవలోకే వస్తోంది సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప2(Pushpa2) సినిమా. సెన్సార్ పూర్తి చేసుకున్న తర్వాత పుష్ప2 రన్ టైమ్ ఏకంగా 3 గంటల 20 నిమిషాల 38 సెకన్లు.
టాలీవుడ్ హిస్టరీలో ఎక్కువ రన్ టైమ్ కలిగిన సినిమాల్లో ఇది మూడోది. మొదటిది దాన వీర శూర కర్ణ(Dana Veera Sura Karna). ఆ సినిమా రన్ టైమ్ 3 గంటల 44 నిమిషాలు. రెండో సినిమా లవకుశ(Lava Kusa). దాని నిడివి 3 గంటల 28 నిమిషాలు. ఈ రెండు సినిమాలూ ఎన్టీఆర్(Sr.NTR)వే కావడం, రెండు సినిమాలూ ఇండస్ట్రీ హిట్ కావడం గమనార్హం. ఇప్పుడు మూడో ప్లేస్ లో ఉన్న పుష్ప2 కూడా అలాంటి రికార్డులనే సృష్టిస్తుందని చిత్ర యూనిట్ మొత్తం ఎంతో ధీమాగా ఉంది. ఏదేమైనా ఓ కమర్షియల్ సినిమాకు సుకుమార్ ఇంత లెంగ్త్ ఎంచుకోవడమనేది మామూలు విషయం కాదు. టైటిల్ నుంచి ఎండ్ కార్డ్ వరకు ఊహించని ట్విస్టులతో పుష్ప2 ఆడియన్స్ ను ఏ మాత్రం బోర్ ఫీల్ అవకుండా చేస్తుందని నిర్మాతలు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. డిసెంబర్ 5న పుష్ప2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.