ఏపీలో పుష్ప2 రేటు ఎంత?
మరో ఆరు రోజుల్లో పుష్ప2(Pushpa2) థియేటర్లలోకి వస్తుంది. దీపావళి తర్వాత సరైన సినిమాల్లేక అల్లాడిపోతున్న థియేటర్లు పుష్ప2తో కళకళలాడనున్నాయి. ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పుష్ప2 తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ రేపు స్టార్ట్ కానున్నాయి. ఇప్పటికే టికెట్ రేట్ల పెంపు కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎప్పుడైనా దానికి సంబంధించిన అనుమతులు వచ్చే అవకాశముంది.
పర్మిషన్ రావడమే లేట్. బుకింగ్ యాప్స్ ట్రాఫిక్ తో కిక్కిరిసిపోవడం ఖాయం. అయితే ఇప్పుడు అందరి దృష్టి టికెట్ రేట్ల పెంపు ఏ రేంజ్ లో ఉంటుందనే దాని పైనే ఉంది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సినీ పరిశ్రమ విన్నపాల పట్ల సానుకూలంగానే ఉన్నాయి కాబట్టి టికెట్ రేట్ల హైక్ గురించి నిర్మాతలు టెన్షన్ పడకుండా కూల్‌గా ఉన్నారు.
పైగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరో కాబట్టి ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా నో అనకుండా చేస్తున్నాడు. కాబట్టి పుష్పకు గరిష్టంగా ఒక్కో టికెట్ మీద 150 నుంచి 200 మధ్యలో హైక్ తెచ్చుకోవచ్చని నిర్మాతలు భావిస్తున్నారు. అంటే మల్టీప్లెక్స్ రేట్ రూ.400 ఉండొచ్చు. రెగ్యులర్ షో ల సంగతి ఎలా ఉన్నా ప్రీమియర్ల డిమాండ్ మాత్రం నెక్ట్స్ లెవెల్ లో ఉంది. టికెట్ దొరకాలే కానీ రేట్ ఎంతైనా సరే తగ్గేదేలే అన్నట్టున్నారు ఆడియన్స్.