బ్రేకప్ గురించి రివీల్ చేసిన రాశీ
ఫిల్మ్ ఇండస్ట్రీలో లవ్ స్టోరీలు, బ్రేకప్ లు మామూలే. బాలీవుడ్ ఈ కల్చర్ చాలా ఎక్కువ. కానీ సౌత్ లో మాత్రం తక్కువ. సౌత్ హీరోయిన్లు ఎవరూ తమ లవ్ స్టోరీల గురించి ఎంత అడిగినా ఎక్కువగా ఓపెన్ అవరు. కానీ నార్త్ ఇండియన్ అమ్మాయి అయిన రాశీ ఖన్నా మాత్రం రీసెంట్ గా తన బ్రేకప్ గురించి మీడియా ముందు ఓపెన్ గా చెప్పింది.
బ్రేకప్ వల్ల తాను చాలా బాధ పడ్డానని చెప్పింది రాశీ. వ్యక్తిగతంగా తాను చాలా ఎమోషనల్ అని, గతంలో తనకు ఓ లవ్ స్టోరీ ఉండేదని, కొన్ని రీజన్స్ వల్ల బ్రేకప్ అయినట్లు చెప్పింది. ఆ టైమ్ లో తాను ఎంతో బాధ అనుభవించడంతో పాటూ డిప్రెషన్ కు కూడా గురైనట్లు రాశీ తెలిపింది. తర్వాత కొన్నాళ్లకు తనను తాను మార్చుకుని స్ట్రాంగ్ గా నిలబడి కెరీర్ మీద దృష్టి పెట్టినట్లు రాశీ వెల్లడించింది.
అయితే రాశీకి ఇండస్ట్రీలోని వ్యక్తుల కంటే బయట ఫ్రెండ్సే ఎక్కువని, తన కష్టాల్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎంతో సపోర్ట్ చేశారని, ఊహలు గుసగుసలాడే సినిమా రిలీజయ్యాకే తనకు స్టారడమ్ అంటే ఏంటో తెలిసిందని అప్పటివరకు ఫేమ్ గురించి తనకు అసలు తెలియదని చెప్పింది. ప్రస్తుతం రాశీ ఖన్నా నీరజ కోన దర్శకత్వంలో సిద్దూ జొన్నలగడ్డతో కలిసి తెలుసు కదా సినిమాలో నటిస్తోంది. అమ్మడి చేతిలో ఉన్న తెలుగు సినిమా ప్రస్తుతానికి ఇదొక్కటే.