ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆయన రాష్ట్రం, దేశం విడిచిపోకుండా చర్యలు చేపట్టాలి : రఘురామ

ఆయన రాష్ట్రం, దేశం విడిచిపోకుండా చర్యలు చేపట్టాలి : రఘురామ

తనను కస్టడీలో హింసించిన కేసులో సుప్రీంకోర్టు విచారణపై ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణ రాజు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  సీఐడీ విచారణ పారదర్శకంగా సాగుతోందని చెప్పారు. తనపై దాడి చేసిన అధికారులు అరెస్టయ్యారన్నారు. త్వరలో మరికొందరు అరెస్టవుతారని పేర్కొన్నారు. విజయ్‌పాల్‌ నన్ను అక్రమంగా అరెస్టు చేసి దురుసుగా ప్రవర్తించారు. కోర్టులో వాస్తవాలు బయటపడుతున్నాయి. అప్పటి సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ తన ప్రైవేటు సిబ్బందితో నాపై దాడి చేయించారు. త్వరలో ఆ వివరాలు కూడా బయటకొస్తాయి. సునీల్‌కుమార్‌ రాష్ట్రం, దేశం విడిచిపోకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి అని అన్నారు.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :