ASBL Koncept Ambience
facebook whatsapp X

త్వరలో రాహుల్ భారత్ 'డోజో' యాత్ర..

త్వరలో రాహుల్ భారత్ 'డోజో' యాత్ర..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మరో దేశవ్యాప్త యాత్రకు సిద్ధమయ్యారు. గతంలో రాజకీయంగా యాత్రను చేపడితే.. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ను యువతకు చేరువ చేసే ఉద్దేశ్యంతో యాత్ర చేయాలని నిర్ణయించారు రాహుల్. త్వరలో తాను 'భారత్ డోజో యాత్ర' చేపడతానని స్పష్టం చేశారు రాహుల్.మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లను డోజోగా పిలుస్తారని తెలిపారు. మెడిటేషన్, జివూ- జిట్సూ(బ్రెజిల్ మార్షల్ ఆర్ట్స్), ఐకిడో (జపాన్ మార్షల్ ఆర్ట్స్) వంటి ఆర్ట్స్ లను ఉపయోగించి అహింసతో ఘర్షణలను పరిష్కరించే పద్ధతులు యువతకు పరిచయం చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు.

తనకు ఐకిడోలో బ్లాక్ బెల్ట్, జివూ -జిట్సూలో బ్లూ బెల్ట్ ఉందని తెలిపారు రాహుల్. తన వీడియో ద్వారా కొందరిలోనైనా ఈ ఆర్ట్స్ నేర్చుకోవాలనే ఇంట్రస్ట్ రావాలని ఆశించారు. "మేం వేల కిలోమీటర్లు జోడో యాత్ర చేశాం. ఆ టైంలో మా శిబిరాల వద్ద ప్రతిరోజు జివు-జిట్సూ ప్రాక్టీస్ చేసేవాళ్లం. ఫిట్ గా ఉండేందుకు మేం ప్రారంభించిన యాక్టివిటీ అందరికీ చేరువైంది. మేం బస చేసిన ప్రాంతాల్లోని తోటి యాత్రికులు, యువ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులను ఒకచోటకు చేర్చింది.

మెడిటేషన్, జివూ-జిట్సూ, ఐకిడోల వంటి జెంటిల్ ఆర్ట్స్ ను యువతకు పరిచయం చేయడమే మా లక్ష్యమన్నారు రాహుల్. దీనిద్వారా ఘర్షణ వాతావరణాన్ని సౌమ్యంగా మార్చే విలువల్ని వారిలో పెంపొందించాలని, దయ, సురక్షితమైన సమాజం కోసం కావాల్సిన సాధనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే త్వరలో భారత్ డోజో యాత్ర చేపట్టాలని నిర్ణయించాం" అని రాహుల్ ట్వీట్ చేశారు. రాహుల్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మొత్తం 110 జిల్లాలు, 100 లోక్ సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 60 రోజులకుపైగా 6,713 కిలోమీటర్ల మేర కొనసాగింది. అంతకుముందు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడోయాత్ర' ను నిర్వహించారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :