తమ్ముడి మరణంతో విషాదంలో చంద్రబాబు.. ఫోన్ చేసి సానుభూతి తెలిపిన రాహుల్ గాంధీ
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడి హఠాన్మరణంతో తీవ్రమైన విషాదంలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు పలువురు కీలక నేతలు సానుభూతి తెలిపారు. ఈ విషాదం జరిగినప్పుడు ఢిల్లీలో ఉన్న చంద్రబాబు.. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. ఏఐజీ ఆసుపత్రి వద్ద బాధలో ఉన్న ఇతర కుటుంబ సభ్యులను చూడగానే ఆయన మరింత వేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో.. సోదరుడి మరణంతో ఆవేదన చెందుతున్న సీఎం చంద్రబాబుకు.. కాంగ్రెస్ కీలక నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫోన్ చేసి పరామర్శించారు. విషాదంలో ఉన్న చంద్రబాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Tags :