ASBL Koncept Ambience
facebook whatsapp X

ప్రభాస్ ఫ్యాన్స్ కు షాకిచ్చిన మారుతి

ప్రభాస్ ఫ్యాన్స్ కు షాకిచ్చిన మారుతి

లేట్ చేసినా ది రాజా సాబ్(The raja Saab) టీమ్ ప్ర‌భాస్(Prabhas) పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫ్యాన్స్ కు మంచి ట్రీటే ఇచ్చింది. రెండు నిమిషాల మోష‌న్ పోస్ట‌ర్ లో ఫ‌స్ట్ టైమ్ డార్లింగ్ లుక్ ను చాలా విభిన్నంగా రివీల్ చేసింది చిత్ర యూనిట్. తెల్ల గ‌డ్డం, అక్క‌డ‌క్క‌డా నెర‌సిన జుట్టు, నోట్లో దొర‌లు తాగే చుట్ట మొత్తానికి ఊహించని రేంజ్‌లో ప్ర‌భాస్ లుక్ ను రివీల్ చేశారు.

హార‌ర్ కాన్సెప్ట్ ను యానిమేష‌న్ రూపంలో డిజైన్ చేసి దానికి త‌మ‌న్(Thaman) బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను యాడ్ చేసి కొత్త‌గా ప్రెజెంట్ చేశారు. మొత్తానికి రాజా సాబ్ గురించి ఇప్పుడో క్లారిటీ వ‌చ్చింది. చూస్తుంటే ప్ర‌భాస్ డ్యూయ‌ల్ రోల్ చేసినట్లు అనిపిస్తోంది. ఒక‌టి యంగ్ లుక్ కాగా, మ‌రోటి పాడుబ‌డిన బంగ‌ళాను రాజ్య‌మేలిన రాజుల కాలం నాటి మ‌హారాజు లుక్.

రెండూ లుక్స్ వేటిక‌వే ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేలా ఉన్నాయి. ఇవాళ మోష‌న్ పోస్ట‌ర్‌తో మారుతి(maruthi) త‌ను ఎలాంటి సినిమా చేస్తున్నాడో క్లారిటీ ఇచ్చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ(people media Factory) ఈ సినిమాను సుమారు రూ.400 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్(Niddhi Agarwal),మాళ‌విక మోహ‌న‌న్(Malavika Mohanan) హీరోయిన్లు గా న‌టిస్తున్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :