ASBL NSL Infratech
facebook whatsapp X

రాజా సాబ్ టీమ్ ఫోక‌స్ అంతా దానిపైనే

రాజా సాబ్ టీమ్ ఫోక‌స్ అంతా దానిపైనే

స‌లార్, క‌ల్కి 2898ఏడీ సినిమాల‌తో వ‌రుస స‌క్సెస్‌లు అందుకున్నాడు ప్ర‌భాస్. క‌ల్కి సినిమా రూ.1000 కోట్ల క‌లెక్ష‌న్స్ దిశ‌గా దూసుకెళ్తుంది. నాగ్ అశ్విన్ క‌ల్కిని హాలీవుడ్ స్టాండ‌ర్డ్స్ లో ఆవిష్క‌రించాడు. అందుకే ఈ సినిమాకు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది. గ‌త రెండేళ్ల‌లో టాలీవుడ్ లో వ‌చ్చిన భారీ హిట్ క‌ల్కినే అనొచ్చు.

మ‌రో రెండు వారాల పాటూ క‌ల్కి సినిమా థియేటర్ల‌లో సంద‌డి చేస్తుంద‌ని ట్రేడ్ పండితులు అంచ‌నా వేస్తున్నారు. ఇదిలా ఉంటే క‌ల్కి హంగామా ముగుస్తుండ‌టంతో ఇప్పుడు ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఫోక‌స్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న రాజా సాబ్ మీద ప‌డింది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ సినిమాను రూ.150 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తోంది.

హ‌ర్ర‌ర్ కామెడీ జాన‌ర్ లో ఈ చిత్రాన్ని మారుతి తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా 50% షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రాజా సాబ్ ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మారుతి టీమ్ రాజా సాబ్ ప్ర‌మోష‌న్స్ పై ఫోక‌స్ చేయ‌నున్నార‌ట‌. అందులో భాగంగానే త్వ‌ర‌లోనే రాజా సాబ్ ఫ‌స్ట్ గ్లింప్స్ ను రెడీ చేయాల‌ని చూస్తున్నార‌ట‌. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ నెల‌లోనే రాజా సాబ్ గ్లింప్స్ ఆడియ‌న్స్ ముందుకొచ్చే ఛాన్సుంద‌ని ఫిల్మ్ న‌ర్ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గ్లింప్స్ రిలీజ్ చేస్తే సినిమా బిజినెస్ కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే ఆలోచ‌న‌తో మేక‌ర్స్ ఇలా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :