రాజ్యసభకు నాగబాబు?
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజ్యసభలో ప్రాతినిధ్యం కోసం బీజేపీ పెద్దలను కలిసి విన్నవించినట్టు తెలిసింది. రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో తమకు ఒకటి కేటాయించాలని ఆయన కోరినట్లు సమాచారం. ఢల్లీి పర్యటనలో భాగంగా ఈ విషయాన్ని కేంద్ర పెద్దల వద్ద ఆయన ప్రస్తావించినట్లు తెలిసింది. పవన్ చర్చలు ఫలిస్తే ఆయన అన్న, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పెద్దల సైభలో అడుగు పెట్టడం నల్లేరుపై నడకేకానుంది. జనసేన ఆవిర్భావం నుంచి నాగబాబు పార్టీ కోసం పని చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమలో నియోజకవర్గంలో పర్యటింని అన్నీ సిద్ధం చేసుకున్నారు. కానీ కూటమి పార్టీల సీట్లు పంపకాల్లో భాగంగా అనకాపల్లి స్థానాన్ని బీజేపీ తీసుకోవడంతో నాగబాబుకు అవకాశం దక్కలేదు. ఆ సమయంలోనే రాజ్యసభకు పంపిస్తానని నాగబాబుకు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో దీనిలో ఒకటి తీసుకుని నాగబాబును పెద్దల సభకు పంపించాలని పవన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢల్లీి పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం ఈ విషయాన్ని కేంద్రంలోని బీజేపీ పెద్దల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. దీనికి వారు కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ చర్చలు ఫలిస్తే రాజ్యసభలో కూడా జనసేనకు ప్రాతినిధ్యం లభించనుంది.