OG: ఓజీలో ఊహించని క్యామియో
పవన్ కళ్యాణ్(Pawan kalyan) ఫ్యాన్స్ ఎంతో వెయిట్ చేస్తున్న సినిమా ఓజి(OG). ఈ సినిమా పేరు రోజుకు ఒకసారైనా తలవకుండా పవన్ ఫ్యాన్స్ నిద్రపోరేమో అనుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. సుజిత్(Sujeeth) దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్(DVV Entertainments) నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాపై అందరిలో భారీ అంచనాలున్నాయి. పవన్ నటిస్తున్న సినిమాల్లో ముందు రిలీజయ్యేది హరిహర వీరమల్లు(Harihara veeramallu) అయినా ఫ్యాన్స్ మాత్రం ఓజినే ముందు రిలీజ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు.
జనవరి లేదా ఫిబ్రవరిలో ఓజీకి గుమ్మడికాయ కొట్టేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ కీలక క్యామియో ఉంటుందని గత రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఆ క్యామియో ప్రభాస్(Prabhas) చేస్తున్నాడని కొందరంటుంటే మరికొందరు కాదు నాని(Nani) అని అన్నారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ క్యామియో చేస్తుంది ఆ ఇద్దరు కాదట.
పవన్ తో మొదటిసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) ఈ సినిమాలో కలిసి నటించబోతున్నాడట. కొన్ని నెలల కిందటే దీనికి సంబంధించిన చర్చ జరిగిందని, తక్కువ డేట్స్ కాబట్టి అవసరమైనప్పుడు ఇస్తానని చరణ్ ఆల్రెడీ సుజిత్ కు హామీ ఇచ్చాడని, దానికి అనుగుణంగానే త్వరలోనే దీన్ని షూట్ చేస్తారంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ ఇన్‌సైడ్ టాక్ మాత్రం నమ్మేట్టుగానే ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం మెగా ఫ్యాన్స్ కు పూనకాలు ఖాయం.