ASBL Koncept Ambience
facebook whatsapp X

మొత్తానికి చ‌ర‌ణ్ ఫ్రీ అయ్యాడు

మొత్తానికి చ‌ర‌ణ్ ఫ్రీ అయ్యాడు

రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ప్ర‌స్తుతం ఎంతో సంతోషంతో ఉన్నారు. దానికి కార‌ణం రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ షూటింగ్ పూర్తి చేయ‌డమే. ఇక్రిశాట్ లో జ‌రిగిన షెడ్యూల్ తో చ‌ర‌ణ్ కు సంబంధించిన సీన్స్ ను డైరెక్ట‌ర్ శంక‌ర్ పూర్తి చేశాడు. ఇప్పుడు చ‌ర‌ణ్, బుచ్చిబాబు సినిమా కోసం రెడీ అయ్యే టైమొచ్చింది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనేది చూడాలి.

గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్త‌యినా ఇంకా చాలానే ప‌నులున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్షన్ వ‌ర్క్స్ ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి. డ‌బ్బింగ్ స్టార్ట్ చేయాలి. అంతా స్టార్ క్యాస్టింగ్ కాబ‌ట్టి డ‌బ్బింగ్ ప‌నులు వీలైనంత త్వ‌ర‌గా డేట్స్ అడ్జస్ట్ చేసి పూర్తి చేయాలి. ఇండియ‌న్2 రిలీజ‌య్యాక జులై లాస్ట్ వీక్ నుంచి శంక‌ర్ ఫ్రీ అవుతాడు. ఆ త‌ర్వాత శంక‌ర్ గేమ్ ఛేంజ‌ర్ పై ఫోక‌స్ చేయ‌నున్నాడు.

రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఎలాగైతేనేం చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ నుంచి బ‌య‌టికొచ్చి ఫ్రీ అయ్యాడు. చ‌ర‌ణ్ ఈ సినిమా కోసం మూడేళ్ల‌కు పైగా కేటాయించాడు. ఈ సినిమా చ‌ర‌ణ్ కెరీర్లోనే బెస్ట్ మూవీ అవుతుంద‌ని ఫ్యాన్స్ ఎంతో బ‌లంగా న‌మ్ముతున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తోంది.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :