Ramana Gogula: చాలా కాలం తర్వాత గోదారి గట్టు మీద పలకరించిన రమణ గోగుల
రమణ గోగుల(Ramana Gogula) మ్యూజిక్‌కు, అతని వాయిస్ కు టాలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. ఒకప్పుడు ఆయన్నుంచి వచ్చిన సాంగ్స్ యూత్ ను ఉర్రూతలూగించాయి. అయితే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రమణ గోగుల ప్రస్తుతం యూఎస్ లో సెటిలయ్యారు. ఇక అసలు విషయానికొస్తే వెంకటేష్(Venkatesh), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో తెరకెక్కుతున్న సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమా కోసం ఆయన మరోసారి గొంతు విప్పారు.
తాజాగా ఈ సినిమా నుంచి గోదారి గట్టు మీద రామసిలకవే(Godari Gattu) అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో(BHeems Sisiroleo) సంగీతం అందించిన ఈ పాటకు భాస్కరభట్ల(Bhaskarabhatla) రాయగా రమణ గోగుల, మధుప్రియ(Madhu priya) కలిసి పాడారు. వెంకీ, ఐశ్వర్య రాజేష్ మధ్య వచ్చే డ్యూయెట్ సాంగ్ గా రూపొందిన ఈ పాటతో రమణ గోగుల తిరిగి ఫామ్ లోకి వచ్చేట్టే ఉన్నాడు.
రమణ గోగుల స్టైల్ కు మంచి సాహిత్యం కుదరడంతో ఈ సాంగ్ ఇన్‌స్టంట్ ఛార్ట్‌బస్టర్ లా అనిపిస్తుంది. ఈ సాంగ్ కోసం అనిల్ రావిపూడి కోరి మరీ రమణ గోగులను తీసుకొచ్చి పాడించాడు. ఇప్పుడు సాంగ్ రిలీజయ్యాక అనిల్ కష్టానికి తగ్గ ఫలితమొచ్చినట్లే అనిపిస్తుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.