వినియోగదారు కేంద్రీకృత కార్యక్రమాలతో గణనీయంగా అమ్మకాల వృద్ధిని సాధించిన రామ్కీ ఎస్టేట్స్
• అత్యుత్తమ బుకింగ్‌లతో దీపావళి ప్రచార విజయాన్ని వేడుక జరుపుకున్న రామ్కీ ఎస్టేట్స్
• పరిశ్రమ నాయకత్వం : ఈ స్పందన భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో విశ్వసనీయ నాయకుడిగా రామ్కీ ఎస్టేట్స్ కీర్తిని మరింత సుస్థిరం చేసింది.
• వినియోగదారు లక్ష్యం : వినియోగదారు కేంద్రీకృత వ్యూహాలు మరియు ఆవిష్కరణ పట్ల రామ్కీ ఎస్టేట్స్ నిబద్ధతను ఈ విజయం వెల్లడిస్తుంది
భారతీయ రియల్ ఎస్టేట్‌లో అగ్రగామిగా ఉన్న రామ్‌కీ ఎస్టేట్స్ & ఫార్మ్స్ లిమిటెడ్, తమ దీపావళి ప్రచారం, అద్భుతమైన విజయాన్ని సాధించటం పురస్కరించుకుని హైదరాబాద్‌లోని హోటల్ అవాసాలో వినియోగదారు కేంద్రీకృత కార్యక్రమంను నేడు నిర్వహించింది. ఈ ప్రచారం, అక్టోబర్ 16 నుండి నవంబర్ 17, 2024 వరకు కొనసాగింది, రియల్ ఎస్టేట్ పరిశ్రమలో విశ్వసనీయ మరియు వినూత్న నాయకుడిగా రామ్కీ ఎస్టేట్స్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తూ, అపూర్వమైన స్పందనను ఈ ప్రచారం పొందింది. ఇంటి కొనుగోలుదారులు మరియు పెట్టుబడిదారులలో అపారమైన విశ్వాసం , డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ, మునుపటి నెలతో పోలిస్తే రామ్‌కీ అమ్మకాలను రెట్టింపు చేయడానికి ఈ ప్రచారం సహాయపడింది.
ఈ కార్యక్రమంలో శ్రీ శరత్ బాబావు శాఖమూరి (హెడ్ – సేల్స్) మాట్లాడుతూ ప్రచార విజయాన్ని వెల్లడించారు . కస్టమర్‌లు చూపిన నమ్మకం మరియు నిరంతర మద్దతు కోసం కృతజ్ఞతలు తెలిపారు. ప్రచార విజయానికి కీలక చోదకమైన లక్కీ డ్రా పోటీ ఆకర్షణీయమైన బహుమతులు అందించింది, బంపర్ బహుమతి గా మహీంద్రా XUV700, 100 గ్రాముల బంగారం మరియు రెండు ఐ ఫోన్ 16 లు వున్నాయి. ఈ ప్రోత్సాహకాలు ప్రచారం యొక్క అత్యుత్తమ పనితీరుకు సహాయపడ్డాయి, బలమైన సంబంధాలను పెంపొందించుకుంటూ, దాని కస్టమర్‌లకు రివార్డింగ్ అనుభవాలను సృష్టించడంలో రామ్‌కీ ఎస్టేట్స్ నిబద్ధతను ప్రదర్శించాయి.
దీపావళి ప్రచారం యొక్క అపూర్వ విజయం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది. ఐటి రంగం, విస్తృత శ్రేణిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ఎన్ఆర్ఐల నుండి పెరుగుతున్న ఆసక్తి కారణంగా కొనుగోలుదారులు మరియు పెట్టుబడిదారులకు నగరం అగ్రశ్రేణి పెట్టుబడి గమ్యస్థానంగా కొనసాగుతోంది. 2024లో, హైదరాబాద్ లో ప్రాపర్టీ ధరల పరంగా స్థిరమైన వృద్ధి కనిపించింది. పర్యావరణ అనుకూల మరియు గేటెడ్ కమ్యూనిటీ జీవనం వైపు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ కారకాలు హైదరాబాద్‌ను రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌గా మార్చాయి, ఇది రామ్కీ ఎస్టేట్స్ కు కీలక మార్కెట్‌గా మారింది.
రామ్కీ ఎస్టేట్స్ యొక్క శ్రేష్ఠత వారసత్వం, 29 సంవత్సరాలుగా నిర్మించబడింది, నాణ్యత మరియు కస్టమర్ సంతృప్తిలో నూతన ప్రమాణాలను నిర్దేశిస్తూనే ఉంది. 1995లో కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుండి, కంపెనీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వరంగల్ మరియు విశాఖపట్నం వంటి నగరాల్లో 10 మిలియన్ చదరపు అడుగుల నివాస మరియు వాణిజ్య స్థలాలను వినియోగదారులకు అందించింది . ప్రస్తుతం 15 మిలియన్ చ.అ.లు అభివృద్ధి దశలో ఉన్నాయి . మరో 10 మిలియన్ చ.అ.లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి, వినూత్న మరియు స్థిరమైన ప్రాజెక్టుల ద్వారా పట్టణ జీవనాన్ని పునర్నిర్వచించడంలో రామ్కీ ఎస్టేట్స్ ముందంజలో ఉంది.
ఈ విజయం గురించి రామ్‌కీ ఎస్టేట్స్ & ఫార్మ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ శరణ్ అల్లా మాట్లాడుతూ, “ఈ ప్రచారం యొక్క విజయం, మేము చేసే ప్రతి పనిలో వినియోగదారులను కేంద్రంగా ఉంచాలనే మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. రామ్కీ ఎస్టేట్స్‌లో, మేము గృహాలను నిర్మించడమే కాకుండా దీర్ఘకాలిక సంబంధాలను పెంపొందించుకుంటున్నాము. మా దీపావళి ప్రచారానికి వచ్చిన అద్భుతమైన స్పందన , మా కస్టమర్‌లు మాపై ఉంచిన నమ్మకాన్ని మరియు శాశ్వత విలువను సృష్టించే అధిక-నాణ్యత ప్రాజెక్ట్‌లను అందించడంలో మా అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది.." అని అన్నారు.
రామ్కీ ఎస్టేట్స్ తమ 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ, పట్టణ జీవనాన్ని పునర్నిర్వచించే శక్తివంతమైన, స్థిరమైన కమ్యూనిటీలను సృష్టించే లక్ష్యం పట్ల కంపెనీ స్థిరంగా ఉంది. ఆవిష్కరణ మరియు కస్టమర్-సెంట్రిసిటీపై బలమైన దృష్టితో, రామ్కీ ఎస్టేట్స్ భారతీయ రియల్ ఎస్టేట్ రంగానికి నాయకత్వం వహిస్తూనే ఉంది, నాణ్యత మరియు విశ్వాసం యొక్క అత్యున్నత ప్రమాణాలను కొనసాగిస్తూ విభిన్న కస్టమర్ అవసరాలను తీర్చే గృహాలను అందిస్తోంది.