Rana Daggubati: ఫ్యూచర్ ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చిన రానా
ఒకప్పుడు రెస్ట్ తీసుకోకుండా సినిమాలు చేసిన రానా(Rana Daggubati), ఇప్పుడు మాత్రం ఖాళీగా ఉంటున్నట్లు అనిపిస్తోంది. రానా హీరోగా వచ్చిన ఆఖరి సినిమా విరాటపర్వం(Virata Parvam). ఆ తర్వాత రానా హీరోగా మరో సినిమా వచ్చింది లేదు. స్పై(Spy) మూవీలో ఓ చిన్న క్యామియో, వేట్టయాన్(Vettayan) సినిమాలో విలన్ పాత్ర తప్పించి అతను మాత్రం హీరోగా మరో సినిమాను ఇప్పటివరకు మొదలుపెట్టింది లేదు.
అయితే రానా తన తర్వాతి సినిమాల విషయంలో ప్రైమ్ వీడియో(Prime Video) కోసం చేస్తున్న టాక్ షో లో క్లారిటీ ఇచ్చాడు. తన నుంచి మూడు క్రేజీ ప్రాజెక్టులు రానున్నాయని, కాకపోతే వాటికి కాస్త టైమ్ పడుతుందని రానా స్పష్టం చేశాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన హిరణ్య కశ్యప(Hiranya Kasyapa)ను రానా చాలా ఏళ్ల కిందే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
హిరణ్య కశ్యప గురించి రానా మాట్లాడుతూ, అది చాలా భారీ స్కేల్ లో చేయాల్సిన సినిమా అని, అమర్ చిత్ర కథల నుంచి స్క్రిప్టు తీసుకున్న తాము, ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తి చేసి సినిమాను మొదలుపెడతామని తెలిపాడు. తేజ(Teja)తో చేయాల్సిన రాక్షస రాజు(Rakshasa Raju) అంచనాలకు తగని విధంగా ఉండాలని టీమ్ బాగా కష్టపడుతుందని అందుకే లేటవుతుందని రానా తెలిపాడు. అలాగే త్రివిక్రమ్(Trivikram) తో కూడా ఒక సినిమా ఉంటుందని రానా కన్ఫర్మ్ చేశాడు. ఏదేమైనా రానా హీరోగా సినిమా చూడాలంటే ఎంతలేదన్నా మరో ఏడాది ఆగాల్సిందే.