రానా రూట్ కరెక్టే
రానా దగ్గుబాటి(Rana Daggubati) హీరోగా పరిచయమైనప్పుడు వెంకీ(Venkatesh) తర్వాత దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చే మరో హీరో రానానే అని అందరూ ఎంతో సంతోషపడ్డారు. కానీ రానా వారి కోరిక తీర్చలేకపోయాడు. లీడర్(Leader), నేనే రాజు నేనే మంత్రి(Nene Raju Nene Mantri) లాంటి ఒకటి రెండు హిట్ సినిమాలున్నప్పటికీ రానా సోలోగా మాత్రం భారీ హిట్ నమోదు చేసుకోలేకపోయాడు.
బాహుబలి(Baahubali)లో భల్లాలదేవ(Bhallaladeva) పాత్ర చేశాక రానా కెరీర్ పూర్తిగా మారిపోయింది. తర్వాత భీమ్లా నాయక్(Bheemla Nayak) లో విలన్ గా నటించాడు. రానా నాయుడు(Rana Naidu) వెబ్ సిరీస్ లో కూడా రిస్క్ తీసుకుని నార్త్ ఆడియన్స్ దృష్టిలో పడ్డాడు. అయితే రానా హీరోగా ఎక్కువ సినిమాలు చేయకుండా నెంబర్ వన్ యారీ(NO1 Yaari), ఇప్పుడు ప్రైమ్ కోసం మరో టాక్ షో చేస్తుండటాన్ని ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు.
వాస్తవానికి రానా చేస్తుంది, వెళ్తున్న దారి కరెక్టే అని చెప్పడానికి కారణాలు లేకపోలేదు. రానా యాక్టింగ్ కు పేరు పెట్టడానికి లేకపోయినా, తనకు మంచి హైట్, ఫిజిక్ ఉన్నప్పటికీ రానా కమర్షియల్ హీరో మెటీరియల్ కాదనేది మాత్రం నిజం. ఛాలెంజింగ్ పాత్రలు, రిస్క్ ఉన్న రోల్స్ కు మాత్రమే రానా సూటవుతాడు. ఆ విషయం తెలుసుకునే రానా దానికి అనుగుణంగా తన ప్లాన్ ను మార్చుకుని హీరోయిజం ఉచ్చులో పడకుండా తనలోని నటుడిని మెరుగుపరుచుకుంటున్నాడు. సో రానా రూట్ కరెక్టే.