ASBL Koncept Ambience
facebook whatsapp X

రాక్ష‌స రాజా వేరే డైరెక్ట‌ర్ తోనా?

రాక్ష‌స రాజా వేరే డైరెక్ట‌ర్ తోనా?

నేనే రాజు నేనే మంత్రి కాంబోని రిపీట్ చేయాల‌నే ఆలోచ‌న‌తో రానా, డైరెక్ట‌ర్ తేజ కొన్ని నెల‌ల కింద‌ట రాక్ష‌స రాజా అనే సినిమాను అనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ అయితే వ‌చ్చింది కానీ ఆ త‌ర్వాత మాత్రం దీని గురించి ఎక్క‌డా ఏ అప్డేట్ లేదు. మ‌రోసారి పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ తో ఆడియ‌న్స్ ను ఎంట‌ర్టైన్ చేస్తార‌ని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న టైమ్ లో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింద‌ని, తేజ త‌న కొడుకుని లాంచ్ చేయ‌డంలో బిజీగా ఉన్నాడ‌ని స‌మాచారం.

అయితే రాక్ష‌స రాజా క‌థ‌ను ఎంతో ఇష్ట‌ప‌డ్డ రానా ఆ క‌థ‌ను తేజ ద‌గ్గ‌ర నుంచి తీసుకుని కొత్త డైరెక్ట‌ర్ తో తీయించే ఆలోచ‌న‌ల చేస్తున్న‌ట్లు స‌మాచారం. పేరు, మిగిలిన వివ‌రాలు ఇంకా బ‌య‌ట‌కు రాలేదు కానీ స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. నిర్మాత‌గా ఇప్ప‌టికే త‌న అభిరుచిని చాటుకున్న రానా హీరోగా న‌టించ‌బోయే సినిమాల విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉంటున్నాడు.

ఈ నేప‌థ్యంలోనే రాక్ష‌స రాజాను తేజ‌తో కాకుండా మ‌రో డైరెక్ట‌ర్ తో చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాక్ష‌స ఆలోచ‌నలున్న వ్య‌క్తి రాజ‌కీయాల్లోకి వ‌స్తే ఎలా ఉంటుంద‌నే పాయింట్ తో రూపొంద‌నున్న రాక్ష‌స రాజా కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాలంటే మ‌రి కొన్ని రోజులాగాల్సిందే. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం రానా ర‌జినీకాంత్ తో చేసిన వేట్ట‌యాన్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. అక్టోబ‌ర్ 10న వేట్ట‌యాన్ రిలీజ్ కానుంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :