ASBL NSL Infratech

నాని హిట్3లో విల‌న్ ఎవ‌రంటే?

నాని హిట్3లో విల‌న్ ఎవ‌రంటే?

శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన హిట్ ఫ్రాంచైజీని నేచుర‌ల్ స్టార్ నాని ఇప్పుడు నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్ల‌డానికి రెడీ అవుతున్నాడు. హిట్ మొద‌టి రెండు భాగాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన నాని, ఇప్పుడు హిట్3 కోసం హీరో గా మార‌నున్నాడు. ఈ సినిమాను కూడా నాని త‌న సొంత బ్యాన‌ర్‌లోనే నిర్మించ‌నున్నాడు.

ఇప్ప‌టికే శైలేష్ హిట్3 క‌థ‌ను రెడీ చేసి నానికి వినిపించగా, నాని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంద‌నేది మాత్రం ఇంకా తెలియ‌లేదు. ప్ర‌స్తుతం స‌రిపోదా శ‌నివార సినిమాతో బిజీగా ఉన్న నాని, అది పూర్త‌వ‌గానే హిట్3 ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విల‌న్ గా ఓ స్టార్ యాక్ట‌ర్ న‌టించ‌నున్నట్లు తెలుస్తోంది.

ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఉండే ఈ సినిమాలో సైకో కిల్ల‌ర్‌ల‌ను ప‌ట్టుకోవ‌డమే హీరో ప‌ని. ఆ సైకో కిల్ల‌ర్ పాత్ర‌ను టాలీవుడ్ భ‌ల్లాల‌దేవుడు రానా ద‌గ్గుబాటి చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఒకే స్క్రీన్ పై న‌టిస్తే సినిమాకు హైప్ ఓ రేంజ్ రావ‌డం ఖాయం. నాని కెరీర్లో మైలురాయిగా ఈ సినిమా నిలిచిపోవ‌డం గ్యారెంటీ. ఈ హిట్3లో మ‌రికొంద‌రు స్టార్ న‌టులు కూడా కీల‌క పాత్ర‌లు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :