ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆ సినిమాను హిందీలో రీమేక్ చేయ‌నున్న రానా

ఆ సినిమాను హిందీలో రీమేక్ చేయ‌నున్న రానా

ఈ రోజుల్లో ఏదైనా భాష‌లో హిట్ అయిన సినిమాను రీమేక్ చేయాలంటే దాన్ని వీలైనంత త్వ‌ర‌గా చేయ‌డమే బెట‌ర్. లేదంటే స‌బ్‌టైటిల్స్ పెట్టుకుని ప్రేక్ష‌కులు ఓటీటీలో చూసే అవ‌కాశముంది. గాడ్ ఫాద‌ర్(God Father), భీమ్లా నాయ‌క్(Bheemla Nayak) లాంటి సినిమాలు పెద్ద హిట్ అవ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మిదే. ఇక అస‌లు విష‌యానికొస్తే 2021లో వ‌చ్చిన త‌మిళ సినిమా మానాడు(Maanadu) పెద్ద హిట్ అయింది.

శింబు(Simbhu)కి ఈ సినిమా ఇచ్చిన జోష్ మామూలుది కాదు. ఆర్టిస్టుగా ఎస్‌జె సూర్య(SJ Surya) నెక్ట్స్ లెవెల్ కు వెళ్ల‌డానికి ఈ సినిమా ఎంతో కీల‌క‌పాత్ర పోషించింది. ఓటీటీలో తెలుగు డ‌బ్బింగ్ తో పాటూ అందుబాటులోకి వ‌చ్చాక అంద‌రూ చూశారు. అయితే ఈ సినిమా రీమేక్ రైట్స్ ను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్(Suresh Productions) ఎప్పుడో కొనింది. కానీ హీరో, డైరెక్ట‌ర్ దొర‌క్క ఆ సినిమా రీమేక్ వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.

క‌ట్ చేస్తే ఇప్పుడీ సినిమాను హిందీలో తీసే ప్లానింగ్ లో రానా ద‌గ్గుబాటి(rana Daggubati) ఉన్నాడు. ఆకాశ‌వాణి(Aakasavani) సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్న అశ్విన్ గంగ‌రాజు(Aswin Gangaraju)తో రానా ఈ సినిమా చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. హీరో ఎవ‌రనేది ఇంకా తెలియదు. మ‌రి తెలుగులో తీస్తారా లేదా అనేది డౌటే. కానీ ఇలాంటి మంచి బ్లాక్ బ‌స్ట‌ర్ ను త్వ‌ర‌గా రీమేక్ చేసి ఉంటే బావుండేది. అయితే సౌత్ లో ఆడిన సినిమాల‌న్నీ నార్త్ లో ఆడ‌తాయ‌నే గ్యారెంటీ లేదు. కానీ ఈ సినిమాకు రానా నార్త్ ఆడియ‌న్స్ కు తగ్గ‌ట్టు కొన్ని మార్పులు చేయించాడ‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి మానాడు రీమేక్ రానాకు ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో చూడాలి.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :