రష్మిక బయటపడిపోయిందిగా!
ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరు అంటే ఎవరైనా మరో నిమిషం ఆలోచించకుండా రష్మిక మందన్నా(Rashmika Mandanna) పేరు చెప్పేస్తారు. గత కొన్ని నెలలుగా రష్మిక నుంచి సినిమాలు రాకపోయినా రానున్న పది నెలల్లో అమ్మడి నుంచి ఏకంగా ఆరుకు పైగా సినిమాలు రానున్నాయి. ముఖ్యంగా రష్మిక శ్రీవల్లి(Srivalli)గా నటించిన పుష్ప2(pushpa2) కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
నిన్న చెన్నైలో జరిగిన పుష్ప2 ఐటెం సాంగ్ లాంచ్ ఈవెంట్ లో రష్మిక మాట్లాడుతూ, తన కెరీర్ పుష్పకు ముందు పుష్పకు తర్వాత అన్నంతగా మారిందని, షూటింగ్ అయిపోయాకి తానేదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగిందని, తనపై పుష్ప(pushpa) సినిమా ఎంతగానో ప్రభావం చూపిందని చెప్పుకొచ్చింది. ఇంతలో యాంకర్లు రష్మికను మీరు సినీ పరిశ్రమకు చెందని వ్యక్తినే పెళ్లి చేసుకుంటారా అని స్టేజ్ మీద కార్నర్ చేసింది.
దానికి రష్మిక ఏ మాత్రం ఆలోచించకుండా అదెవరో అందరికీ తెలుసని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని నవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. రష్మిక డైరెక్ట్ గా ఫలానా అని పేరు చెప్పలేదు కానీ గత కొంతకాలంగా రష్మిక, విజయ్ దేవరకొండ(Vijay devarakonda) రిలేషన్షిప్లో ఉన్నారని పలుసార్లు ప్రచారమైంది. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలాసార్లు వైరల్ అయ్యాయి. మొత్తానికి రష్మిక ఈవెంట్ లో మాట్లాడింది తక్కువే అయినా సోషల్ మీడియాలో తన పేరు మాత్రం బాగా వైరల్ అవుతుంది. కాగా తను నటించిన పుష్ప2 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.