ASBL NSL Infratech

ఏపీ సీఐడీ చీఫ్‌గా రవిశంకర్‌

ఏపీ సీఐడీ చీఫ్‌గా రవిశంకర్‌

ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విభాగాధిపతిగా రవిశంకర్‌ అయ్యన్నార్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్‌గా  ఉన్న ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. ఆ స్థానంలో శంఖబ్రత బాగ్చీని విశాఖ పోలీసు కమిషనర్‌గా నియమించింది. ప్రస్తుతం ఆయన శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా ఉన్నారు.  ఏపీఎస్సీ బెటాలియన్స్‌ ఏడీజీ అతుల్‌ సింగ్‌ను ఏసీబీ డీజీపీగా బదిలీచేసింది.  ఈ మేరకు ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :