ఆర్సీబీ ఐపీఎల్ కప్ కల నెరవేరేనా..? కొత్త టీమ్ ఎంపిక వెనక ఉద్దేశ్యమిదేనా..?
ఐపీఎల్ 2025 మెగావేలంలో బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ సెలక్షన్ అదిరిపోయింది. వేలంలో సత్తా ఉన్న ఆటగాళ్లనే కొనుగోలు చేసింది. హిట్టర్లు లియామ్ లివింగ్‌స్టోన్, ఫిల్ సాల్ట్, టీమ్ డేవిడ్, జితేష్ శర్మలను తీసుకుంది. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌కు తోడుగా టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను కొనుగోలు చేసింది. భారత్ బౌలర్లు కృనాల్ పాండ్యా, రసిఖ్ దార్లను ఆర్సీబీ సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2025 వేలానికి ముందు విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, యశ్ దయాల్‌లను ఆర్సీబీ అట్టిపెట్టుకుంది. రూ.83 కోట్ల భారీ పర్స్‌తో వేలంలోకి వచ్చిన ఆర్సీబీ.. 19 మంది ఆటగాళ్లను తీసుకుంది. లుంగి ఎంగిడి, నువాన్ తుషార, రొమారియో షెఫర్డ్ లాటి విదేశీ ఆటగాళ్లను ఆర్సీబీ దక్కించుకుంది. దేవ్‌దత్ పడిక్కల్, స్వప్నిల్ సింగ్, మోహిత్ రాధే, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ లాంటి ఇండియన్ ప్లేయర్స్ జట్టులోకి వచ్చారు. పడిక్కల్, సుయాష్ శర్మలు దేశవాళీ టోర్నీలలో సత్తాచాటారు.
అయితే కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చహల్, మహమ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ల కోసం ఆర్సీబీ కనీసం బిడ్ కూడా వేయలేదు. ఆర్‌టీమ్ కార్డ్ ఉపయోగించుకునేందుకు కూడా ఆసక్తి చూపలేదు. ఆర్‌టీమ్ కార్డ్ ఉపయోగించలేదు. కనీస ధరలకే మాజీ ప్లేయర్స్ అందుబాటులో ఉన్నా.. ఆర్సీబీ కొనుగోలు చేయలేదు. టీమ్ మొత్తాన్ని మార్చాలనే ఉద్దేశంతో.. పూర్తిగా కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. కాస్త ఆల్‌రౌండర్ల లోటు ఉన్నా.. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆర్సీబీ పటిష్టంగానే ఉంది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి బెంగుళూరు రాయల్ చాలెంజర్స్.. కప్ కొట్టాలని ప్రయత్నిస్తోంది. జట్టుగా చూసేందుకు చాలా పటిష్టంగా ఉండే ఆర్సీబీ.. ఎందుకో తెలియదు కానీ కప్ సాదించడంలో విఫలమవుతూ వస్తోంది. టీమ్ మేనేజ్ మెంట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈసారి టీమ్ లో చాలామందిని మార్చేసింది మేనేజ్ మెంట్.