ASBL Koncept Ambience
facebook whatsapp X

యుద్ధం ఆపేశక్తి మోడీకే ఉందన్న పుతిన్

యుద్ధం ఆపేశక్తి మోడీకే ఉందన్న పుతిన్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు ప్రపంచదేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. రెండున్నరేళ్ల సుదీర్ఘ యుద్ధం తర్వాత ఉక్రెయిన్ తో శాంతి చర్చలకు తాము సుముఖమేనని రష్యా ప్రకటించింది. ఓవైపు యుద్ధం జరుగుతుండగా శాంతి చర్చల ప్రస్తావన తెచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్. అయితే ఇందుకోసం భారత్ మధ్య వర్తిత్వం వహించాలన్నారు. భారత్‌తోపాటు చైనా, బ్రెజిల్ దేశాలు.. యుద్ధం ఆపేందుకు శాంతి చర్చల కోసం మధ్యవర్తిత్వం వహించాలని పుతిన్ తెలిపారు.

దీంతో సుదీర్ఘంగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్‌పై క్షిపణులు, బాంబులతో యుద్ధాన్ని ప్రారంభించిన రష్యా.. ఎట్టకేలకు దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత.. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. మాస్కో - కీవ్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించే శక్తి.. భారత్‌, చైనా, బ్రెజిల్‌ దేశాలకు మాత్రమే ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చెప్పారు. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన మొదటి వారంలోనే తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో రెండు దేశాల మధ్య కుదిరిన ప్రాథమిక ఒప్పందాన్ని ఉక్రెయిన్‌ ఇప్పటివరకు అమలులోకి తీసుకురాలేదని పుతిన్ విమర్శించారు. ఆ ఒప్పందం ప్రకారమే భవిష్యత్తులో కీవ్‌తో మాస్కో శాంతి చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌తో చర్చలకు రష్యా ఎప్పుడూ సిద్ధంగానే ఉందని.. వ్లాదివాస్తోక్‌లో జరుగుతున్న ఈస్ట్రన్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో పుతిన్‌ వెల్లడించారు. కీవ్‌తో శాంతి చర్చలకు మాస్కో ఎప్పుడూ నిరాకరించలేదని స్పష్టం చేశారు. అయితే ఉక్రెయిన్ చేసే అసంబద్ధ డిమాండ్లతో శాంతి చర్చలు చేపట్టలేమని చెప్పారు. యుద్ధం ప్రారంభంలో ఇస్తాంబుల్‌లో జరిగిన చర్చల్లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడి ప్రతినిధుల బృందం ఒప్పందంపై సంతకం చేసిందని.. అయితే పశ్చిమ దేశాలైన అమెరికా, ఐరోపా దేశాల ఒత్తిడితో ఉక్రెయిన్ వాటిని అమల్లోకి తీసుకురాలేదని మండిపడ్డారు. రష్యాను వ్యూహత్మకంగా ఓడించాలని కొన్ని ఐరోపా దేశాలు కలలు కంటున్నాయని పుతిన్‌ తెలిపారు.

ఇక మాస్కోలోని అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌లో మాట్లాడిన పుతిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌.. రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చల ప్రక్రియలో భారత్‌ పాత్ర కీలకమని తెలిపారు. మోదీ-పుతిన్‌ మధ్య నిర్మాణాత్మక, స్నేహపూర్వక సంబంధాలున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పుతిన్, వొలోదిమిర్ జెలెన్‌స్కీలతో నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని శాంతి చర్చలు ఏర్పాటు చేయవచ్చని అన్నారు. ఈ యుద్ధంలో రష్యా వైఖరిని కూడా క్రెమ్లిన్‌ వెల్లడించింది. ఉక్రెయిన్‌లో తాము విధించుకున్న లక్ష్యాలను సాధించుకునేంత వరకు రష్యా సైనిక చర్యను కొనసాగిస్తుందని దిమిత్రీ పెస్కోవ్‌ చెప్పారు. పశ్చిమ దేశాలకు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో దౌత్య పరిష్కారం చూపించడంలో ఆసక్తి కనబరచడం లేదని విమర్శించారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :