ASBL Koncept Ambience
facebook whatsapp X

మేజిక్.. కావాల‌నే లేట్ చేస్తున్నారా?

మేజిక్.. కావాల‌నే లేట్ చేస్తున్నారా?

ప్ర‌స్తుతం రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సితార బ్యాన‌ర్ లో భారీ సినిమా చేస్తున్న డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి ఈ సినిమా కంటే ముందుగా ఇదే బ్యాన‌ర్ లో మేజిక్ అనే చిన్న సినిమాను చేశాడు. కొత్త ఆర్టిస్టుల‌తో రూపొందిన ఈ సినిమా షూటింగ్ పూర్తైన‌ప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అప్డేట్ లేదు. సినిమాను అనౌన్స్ చేసిన‌ప్పుడు లీడ్ క్యాస్టింగ్ తో ఉన్న ఒక పోస్ట‌ర్ త‌ప్పించి మేజిక్ నుంచి మ‌రే ఇత‌ర కంటెంట్ రిలీజ్ కాలేదు.

ఎమోష‌న్స్ తో పాటూ ఫుల్ లెంగ్త్ కాలేజ్ ఎంట‌ర్టైన్మెంట్ ను జోడించి గౌత‌మ్ ఈ సినిమాను తెర‌కెక్కించాడ‌ని ఈ సినిమాకు యూత్ లో మంచి క్రేజ్ వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని అన్నారు. అయితే ఈ సినిమా గురించి అప్డేట్స్ రాక‌పోవ‌డానికి ప‌లు కార‌ణాలున్నట్లు తెలుస్తోంది. అందులో మొద‌టిది అనిరుధ్. ఇప్ప‌టికే ఈ సినిమాకు పాట‌లు పూర్తి చేసిన అనిరుధ్ బీజీఎంకు సంబంధించిన వ‌ర్క్స్ ను పూర్తి చేయాల్సి ఉంది. కానీ ప్ర‌స్తుతం అనిరుధ్ అస‌లు తీరిక లేకుండా వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.

దీంతో విజ‌య్ సినిమా త‌ర్వాత మేజిక్ వ‌ర్క్స్ చూసుకుందామ‌ని దీన్ని లైట్ తీసుకున్నార‌ట‌. విజ‌య్12 హిట్ అయితే ఆ కార‌ణంతో మేజిక్ కు మంచి బిజినెస్ జ‌రుగుతుంది. అనిరుధ్ క్రేజ్ వ‌ల్ల త‌మిళంలో కూడా మేజిక్ కు మంచి క్రేజ్ ఏర్ప‌డుతుంది. వీటికి తోడు ఇప్పుడు సినిమాను రిలీజ్ చేయ‌డానికి మంచి రిలీజ్ డేట్స్ కూడా లేవు. వీట‌న్నింటినీ బ‌ట్టి చూస్తుంటే మేజిక్ రిలీజ్ కోసం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ వ‌ర‌కు ఎదురుచూడ‌క త‌ప్పేలా లేదు.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :