ASBL Koncept Ambience
facebook whatsapp X

ఏపీలో రూ.65 వేల కోట్ల భారీ పెట్టుబడులపై రిలయన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

ఏపీలో రూ.65 వేల కోట్ల భారీ పెట్టుబడులపై రిలయన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

ఎపి బయో ఇంధన రంగంలో రిలయన్స్ భారీ పెట్టుబడులు చారిత్రాత్మకం!
రిలయన్స్ నిర్ణయం ఎపి ప్రజలు, పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం పెంచింది
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు రిలయన్స్ పెట్టుబడులే నిదర్శనం
బయో ఇంధన ప్రాజెక్టు ఒప్పందం సందర్భంగా మంత్రి నారా లోకేష్

అమరావతి: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి అయిదునెలల్లోనే రిలయన్స్ ఎనర్జీ సంస్థ బయో ఇంధన ప్రాజెక్టులో రూ.65వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో బయో ఇంధన ప్రాజెక్టుకు సంబంధించి రిలయన్స్ ప్రతినిధులు, ఎపి ప్రభుత్వ ఉన్నతాధికారుల నడుమ అవగాహన ఒప్పందం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... తాను ముంబాయిలో రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఎనర్జీ అధినేత అనంత్ అంబానీతో చర్చలు జరిపిన 30రోజుల్లోనే ఒప్పందం జరగడం చారిత్రాత్మకమైన ఘట్టమని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలకు ఈ ఒప్పందం ఊతమిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు యుపిలోని బారాబంకీ బయోఫ్యూయల్ ప్రాజెక్టు వేగవంతంగా అమలైందని, రాష్ట్రంలో రిలయన్స్ ఏర్పాటుచేయబోయే ప్రాజెక్టు ఆ రికార్డును బద్దలు గొడుతుందని తెలిపారు.

డిసెంబర్ 28న ప్రకాశం జిల్లా కనిగిరిలో తొలి బయో ఇంధన ప్రాజెక్టుకు శంకుస్థాపన జరుగుతుందని, రాబోయే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 500 ప్లాంట్ల ఏర్పాటు పూర్తిచేస్తారని చెప్పారు. తొలిదశ ప్రాజెక్టు వచ్చే ఏడాది డిసెంబర్ 28నాటికి (ఏడాదిలో) పూర్తిచేస్తామని రిలయన్స్ ఎనర్జీ ఎపి ప్రతినిధి ప్రసాద్ తెలిపారు.

మంత్రి లోకేష్ స్పందిస్తూ... రిలయన్స్ బయో ఇంధన ప్రాజెక్టుకు ఎపి ప్రభుత్వం తరపున అవసరమైన పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. రిలయన్స్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఎపి ప్రజలతోపాటు పారిశ్రామికవేత్తల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తుందని అన్నారు. 5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న తమ ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు అవుతున్నందుకు రిలయన్స్ అధినేతలు ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

 

Click here for Photogallery

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye Radha Spaces
Tags :