ASBL Koncept Ambience
facebook whatsapp X

న్యాయవ్యవస్థపై నాకు అత్యంత విశ్వాసం : సీఎం రేవంత్‌

న్యాయవ్యవస్థపై నాకు అత్యంత విశ్వాసం : సీఎం రేవంత్‌

భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మంజూరైన బెయిల్‌కు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై రేవంత్‌ రెడ్డి స్పందించారు. నా వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను ప్రశ్నిస్తున్నట్లుగా కొందరు ఆపాదించారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నా. న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల నాకు అపార గౌరవం, విశ్వాసం ఉన్నాయి. రాజ్యాంగం, దాని విలువలను విశ్వసించే నేను ఎన్నటికీ న్యాయవ్యవస్థను అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటా అని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :