ASBL Koncept Ambience
facebook whatsapp X

RBI : ఆర్‌బీఐ నూతన గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా

RBI : ఆర్‌బీఐ నూతన గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ( ఆర్‌బీఐ) నూతన గవర్నర్‌గా రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా (Sanjay Malhotra) నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (Shaktikanta Das) పదవీ కాలం (డిసెంబర్‌ 10)తో ముగియడంతో తదుపరి గవర్నర్‌ను కేంద్రం నియమించింది. 2018లో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్‌, పదవీ కాలం 2021లోనే ముగియగా కేంద్రం మరో మూడేళ్లు పొడిగించింది. ఈ గడువు కూడా డిసెంబర్‌ 10తో ముగియనుండడంతో కొత్త గవర్నర్‌ను నియామకానికి కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. మల్హోత్రా ఆర్‌బీఐకి 26వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. డిసెంబర్‌ 11 నుంచి మూడేళ్ల కాలం పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :