Prabhas: డార్లింగ్ కు రిషబ్ శెట్టి కథ
ప్రస్తుతం ఇండియన్ సినీ హీరోల్లో ప్రభాస్(Prabhas) అంత ఫాస్ట్ గా సినిమా చేస్తున్న వాళ్లు ఎవరూ లేరు. ఒకేసారి రెండు మూడు సినిమాలను సెట్స్ లో ఉంచిన ప్రభాస్ ఎలాంటి ప్రెజర్ లేకుండా చాలా కూల్ గా కనిపిస్తూ ఉంటాడు. ప్రస్తుతం హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో సినిమా చేస్తున్న ప్రభాస్, త్వరలోనే రాజా సాబ్(Raja Saab) షూటింగ్ ను ఫినిష్ చేయనున్నాడు.
ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)తో కలిసి స్పిరిట్(Spirit) ను మొదలుపెట్టనున్నాడు. ఇవి కాకుండా ప్రభాస్ రీసెంట్ గా హోంబలే ఫిల్మ్స్ (Hombale Films)తో కలిసి మూడు ప్రాజెక్టులు ప్రకటించడం సంచలనం రేపిన విషయం తెలిసందే. దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో కాంతార2(Kanthara2) చేస్తున్న రిషబ్ శెట్టి(Rishab Shetty) ఓ పవర్‌ఫుల్ స్టోరీని హోంబలే మేకర్స్ కు వినిపించారట.
ఆ కథ ప్రభాస్ కు బాగా సూటవుతుందని భావించి ఆ మేరకు మేకర్స్ లాక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ కథకు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది మాత్రం సస్పెన్స్ గా మిగిలింది. సలార్2(Salaar2) కాకుండా మిగిలిన రెండింటిలో ఒకటి ప్రశాంత్ వర్మ(Prasanth Varma), మరొకటి లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) తో చేస్తారని ముందు టాక్ వినిపించింది కానీ అందులో నిజమెంతన్నది మాత్రం తెలియాల్సి ఉంది.