ASBL Koncept Ambience
facebook whatsapp X

హనుమాన్ గా ఆశ్చర్యపరిచిన రిషబ్ శెట్టి- 'జై హనుమాన్' ఫస్ట్ లుక్ రిలీజ్

హనుమాన్ గా ఆశ్చర్యపరిచిన రిషబ్ శెట్టి- 'జై హనుమాన్' ఫస్ట్ లుక్ రిలీజ్

విజనరీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, (Prashanth Varma)ట్రూ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్ తర్వాత మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ జై హనుమాన్ (Jai Hanuman) కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో చేతులుకలిపారు. ఈ ఎక్సయిటింగ్ న్యూ ప్రాజెక్ట్‌లో నేషనల్ అవార్డ్ విన్నర్ రిషబ్ శెట్టి (Rishabh Shetty) లీడ్ రోల్ పోషించనున్నారు.

ఈ కొలాబరేషన్ ప్రముఖ ప్రతిభావంతులను ఒకచోట చేర్చింది, మోస్ట్ ఎవైటెడ్ ఇండియన్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ వరుస బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందజేస్తుండగా, సమకాలీన కథలను పౌరాణిక కథలతో అద్భుతంగా బ్లెండ్ చేయడంలో ప్రశాంత్ వర్మ గొప్పపేరు తెచ్చుకున్నారు. రిషబ్ శెట్టి కాంతార తో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడంతో, ఈ కాంబినేషన్ లోని చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. ఈ డైనమిక్ కాంబినేషన్ కోసం అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హనుమాన్ గా నటించే నటుడిని రివిల్ చేయడంతో పాటు, చిత్ర నిర్మాతలు బ్రెత్ టేకింగ్ ఫస్ట్-లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు, అది పాత్ర సోల్ ని ప్రజెంట్ చేస్తోంది. పోస్టర్‌లో రిషబ్ శెట్టి హనుమంతునిగా పవర్ ఫుల్ పోజ్ లో, శ్రీరాముని విగ్రహం చేతిలో భక్తిపూర్వకంగా పట్టుకొని అతని పాదాల మీద కూర్చొని కనిపించారు.

ఈ అద్భుతమైన పోస్టర్ రిషబ్ ఫిజికాలిటీని హైలైట్ చేయడమే కాకుండా హనుమంతునికి సంబంధించిన లోతైన భక్తి, శక్తిని ప్రజెంట్ చేస్తోంది. పాత్ర చిత్రీకరణ లెజెండరీ లక్షణాలతో సంపూర్ణం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది, ఈ అద్భుత పాత్రకు అతను తెరపై ఎలా జీవం పోస్తాడో చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ప్రశాంత్ వర్మ మరింత గొప్ప కథను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు, ఈ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అది స్పష్టంగా కనిపిస్తుంది.

జై హనుమాన్ అనేది విడదీయరాని శక్తి, విధేయతతో కూడిన హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిక్, సినిమా లెజెండ్‌ని పునర్నిర్వచించటానికి సెట్ చేయబడింది.  

హనుమంతుని మౌనం శరణాగతి కాదు, ప్రయోజనం కోసం వేచి ఉంది. జై హనుమాన్ అనేది విడదీయరాని భక్తికి, అన్ని అసమానతలను ధిక్కరించే ప్రతిజ్ఞ యొక్క బలానికి నివాళి. అమర స్ఫూర్తిని జరుపుకునే గొప్ప సినిమాటిక్ జర్నీని ఎక్స్ పీరియన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి.

జై హనుమాన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగం. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని మ్యాసీవ్ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :