ASBL Koncept Ambience
facebook whatsapp X

మధురై లో ఆర్కే రోజా హడావిడి.. ఏపీకి వచ్చే ధైర్యం లేదా?

మధురై లో ఆర్కే రోజా హడావిడి.. ఏపీకి వచ్చే ధైర్యం లేదా?

ఆంధ్రాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత సడన్గా సైలెంట్ అయిపోయిన వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఆర్కే రోజా(R.K.Roja).. త్వరలో వైసీపీ (YCP) కి గుడ్ బై చెప్పబోతోంది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సడన్గా తిరిగి రోజా యాక్టివ్ అవడంతో పాటు రోజుకొక గుడి చొప్పున సందర్శిస్తోంది. అయితే ఇదంతా ఆమె కేవలం తమిళనాడు పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తోంది. ఏపీ గురించి మాట్లాడే ధైర్యం ఉన్న రోజా ఏపీకి వచ్చి మాట్లాడే ధైర్యం చేయడం లేదని అందరూ విమర్శిస్తున్నారు. 

తమిళ్ నాట హీరో విజయ్ పార్టీ (Vijay Party) పెట్టిన తర్వాత రోజా ఆ పార్టీ గూటికి చేరుతుంది అన్న ప్రచారాలు జరిగాయి. అయితే ప్రస్తుతం రోజా ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఆంధ్ర రాజకీయాల గురించే మాట్లాడడం తమిళ్ మీడియా ప్రతినిధులను విస్మయానికి గురిచేస్తుంది. ప్రస్తుతం హాట్ టాపిక్ గా సాగుతున్న తిరుమలలో లడ్డు (Tirumala Laddu)పవిత్రత గురించి.. దాని విశిష్టతను దెబ్బతీసేలా చంద్రబాబు (Chandra Babu) వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆ పాపాన్ని ప్రక్షాళన చేయాలంటూ వైసీపీ అధిష్టానం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తోంది. 

ఈ నేపథ్యంలో రోజా కూడా ఆలయాలను సందర్శిస్తోంది. అయితే అవి ఆంధ్రాలోవి కాదు.. తాజాగా మధురై లోని మీనాక్షి టెంపుల్ కి వెళ్లిన రోజా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పై తమిళంలో తిట్ల వర్షం కురిపించింది. చంద్రబాబు ఎప్పుడు పూజలకు హాజరైన ఆయన కాళ్లకు షూస్ వేసుకొని వస్తారు…నిజంగా ఆయనకు దేవుడంటే భయం భక్తి ఉన్నాయా అంటూ రోజా ప్రశ్నించింది. 

కేవలం జగన్ ను( Jagan ) రాజకీయంగా దెబ్బతీయాలని.. ఆంధ్రాలో వైసీపీని జీరో చేయాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు చేస్తున్న కుట్ర ఇది అని ఆమె పేర్కొంది. అంతేకాదు పవన్ భార్య క్రిస్టియన్ కాదా.. వాళ్ల పిల్లలు బాప్టిజం తీసుకోలేదా.. ఈ విషయాలను స్వయంగా వెల్లడించిన పవన్ ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడడం విచిత్రంగా ఉంది అంటూ ప్రస్తుతం రోజా మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో..నెటిజ‌న్లు ఆమెపై సెటైర్లు వర్షం కురిపిస్తున్నారు. ఆరోగ్య సమస్య కారణంగా చంద్రబాబు ఎప్పుడు కాళ్ళకి సాక్స్ వేసుకొని ఉంటారు అంతే తప్ప ఆయన పూజల సమయంలో ఎప్పుడు షూస్ వేసుకోలేదు. ఇక పవన్ జీవితం అందరికీ తెరిచిన పుస్తకమే. అసలు రోజా ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది.. ఏం ప్రూవ్ చేసుకోవాలి అనుకుంది అన్న విషయం కనీసం ఆమె కైనా తెలుసో లేదో అని అందరూ భావిస్తున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :