ASBL NSL Infratech

బంప‌రాఫ‌ర్ కొట్టేసిన రుహానీ

బంప‌రాఫ‌ర్ కొట్టేసిన రుహానీ

రుహానీ శ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. చిల‌సౌ సినిమాతో టాలీవుడ్ కు పరిచ‌య‌మైన రుహానీ దొరికిన ప్ర‌తీ అవ‌కాశాన్నీ స‌ద్వినియోగం చేసుకుంటూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే అమ్మ‌డు టాలెంట్ కు త‌గ్గ స్టార్ ఛాన్స్ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు రాలేదు. రుహానీ తెలుగులో కంటే ముందుగా త‌మిళంలో త‌న ల‌క్ ను ప‌రీక్షించుకుంది.2017లో వ‌చ్చిన క‌డ‌సీ బెంచ్ కార్తీ సినిమాలో రుహానీ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా పెద్ద‌గా ఆడ‌క‌పోవ‌డంతో ఆమెను అక్క‌డెవ‌రూ ప‌ట్టింకోలేదు. ప్ర‌స్తుతం తెలుగు, హిందీ భాష‌ల్లో రాణిస్తున్న రుహానీకి ఇప్పుడు కోలీవుడ్ నుంచి ఓ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. స్టార్ హీరో క‌విన్ కు జంట‌గా న‌టించే బంప‌రాఫ‌ర్ ను రుహానీ కొట్టేసింద‌ని వార్తలొస్తున్నాయి.

వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో రుహానీకి ఛాన్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఏడేళ్ల గ్యాప్ త‌ర్వాత రుహానీ ఇప్పుడు మ‌ళ్లీ అదిరిపోయే ఆఫ‌ర్ తో కోలీవుడ్ లోకి ఎంట‌ర‌వనుంది. ఇక రుహానీ సినిమాల్లో పాత్ర‌కు త‌గ్గ‌ట్టు ఎలా క‌నిపించినా సోష‌ల్ మీడియాలో మాత్రం అందాల ఆర‌బోత విష‌యంలో కాంప్ర‌మైజ్ అయ్యేదేలేదంటూ కుర్రాళ్ల‌ను రెచ్చ‌గొట్టే ఫోటోల‌ను షేర్ చేస్తోంది.  

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :