శ్రీలంక పార్లమెంటు ఎన్‌పీపీదే
శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో అధ్యక్షుడు అనురకుమార దిస్సనాయకే సారథ్యంలోని నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) పార్టీ అఖండ విజయం సాధించింది. మూడిరట రెండొంతుల మెజార్టీతో దిస్సనాయకే పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. 225 సీట్లు ఉన్న పార్లమెంటులో 159 స్థానాల్లో ఎన్‌పీపీ విజయం సాధించిందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తమిళులు అధికంగా ఉన్న జాఫ్నాలోనూ ఎన్‌పీపీ హవా కనిపించింది. ఆ ప్రాంతంలో అత్యధిక ఓట్లును దక్కించుకుని చరిత్రను తిరగరాసింది. దామాషా పద్దతిలో ఆరింట్లో మూడు సీట్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో దక్షిణంలో సంప్రదాయ తమిళ పార్టీలను ఓడిరచిన మొదటి సింహళ పార్టీగా ఎన్‌పీపీ నిలిచింది. ఈ ఎన్నికల్లో ఎన్‌పీపీ 68 లక్షలకుపైగా (61 శాతం) ఓట్లు సాధించింది. సాజిత్ ప్రేమదాస నేతృత్వంలోని సమజి జన బలవేగయ పార్టీ 40 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. కొలంబోలోని భారత హైకమిషనర్ సంతోష్ ఝా అధ్యక్షుడు దిస్సనాయకేను కలిసి అభినందనలు తెలిపారు.