ASBL Koncept Ambience
facebook whatsapp X

ఎన్టీఆర్ కొత్త సినిమా పుకార్లు

ఎన్టీఆర్ కొత్త సినిమా పుకార్లు

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఎంతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు దేవ‌ర సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తూనే మ‌రోవైపు రెండు పాన్ ఇండియా సినిమాల‌ను లైన్ లో పెట్టాడు. ఇలాంటి బిజీ షెడ్యూల్ లో ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి నెట్టింట ఓ ప్ర‌చారం జ‌రుగుతుంది. హాయ్ నాన్న డైరెక్ట‌ర్ శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వంలో తార‌క్ సినిమా చేయ‌బోతున్నాడ‌ని వార్తలొచ్చాయి. హాయ్ నాన్న ను తీసిన నిర్మాణ సంస్థ వైరా ఎంట‌ర్టైన్‌మెంట్స్ బ్యాన‌రే ఈ సినిమాను కూడా నిర్మించ‌నుంద‌ని అన్నారు. అయితే హాయ్ నాన్న లాంటి సున్నిత‌మైన సినిమా తీసిన శౌర్యువ్, ఎన్టీఆర్ లాంటి ఊర మాస్ హీరోని ఎలా హ్యాండిల్ చేస్తాడా అని కొంద‌రంటే, మ‌రికొంద‌రు మాత్రం ఈ కాంబోపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉంటే తార‌క్ స‌న్నిహిత వ‌ర్గాలు మాత్రం ఈ కాంబో గురించి వ‌స్తున్న వార్త‌ల‌న్నీ ఊహాగానాలే అని, ఈ సినిమా గురించి ఎన్టీఆర్ ఇంకా డెసిష‌న్ తీసుకోలేద‌ని అంటున్నారు. ఈ విష‌యంలో కేవ‌లం తార‌క్ ద‌గ్గ‌ర‌కు ఒక ప్ర‌పోజ‌ల్ మాత్ర‌మే వెళ్లింద‌ని, దానికి ఆయ‌న చూద్దామ‌ని అన్నాడే త‌ప్పించి ఎలాంటి క‌మిట్‌మింట్ ఇవ్వ‌లేద‌ని ఈ లోపు దాన్ని ఇష్టమొచ్చిన‌ట్లు ప్ర‌చారం చేస్తున్నార‌ని అంటున్నారు. కాబ‌ట్టి ప్ర‌స్తుతానికి ఈ సినిమా గురించి వస్తున్న వార్త‌లన్నీ ఊహాగానాలే అంటున్నారు.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :