సీఎం నియోజకవర్గంలో .. ఇలాంటి ఘటనలు : సబిత
లగచర్ల ఘటనను బీఆర్ఎస్కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో సబిత ఫిల్మ్‌నగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా లగచర్లలో జిల్లా కలెక్టర్, అధికారులపై జరిగిన దాడి బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి బీఆర్ఎస్ చేయించిందని అంటగట్టే ప్రయత్నం జరుగుతోంది. నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మా పార్టీ సైలెంట్ అవుతుందని అనుకుంటున్నారు. అరెస్ట్‌లకు భయపడం, ప్రజా గొంతుకగా ఉంటాం. ఫార్మా సిటీపై ప్రభుత్వానికే స్పష్టత లేదు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి అని అన్నారు.
Tags :