ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆ విష‌యంలో ఎన్టీఆర్, ప్ర‌భాస్ త‌ర్వాత మెగా మేన‌ల్లుడే

ఆ విష‌యంలో ఎన్టీఆర్, ప్ర‌భాస్ త‌ర్వాత మెగా మేన‌ల్లుడే

టాలీవుడ్ లో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఒక్క‌సారిగా తినే హీరో ఎవ‌రైనా ఉన్నారా అంటే వెంట‌నే అంద‌రూ జూనియ‌ర్ ఎన్టీఆర్(Jr ntr) పేరు చెప్తారు. త‌న తిండి గురించి తానే స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. హైద‌రాబాద్ బిర్యానీ తిన‌డంలో తాను స్పెష‌ల్ అని, బిర్యానీనే కాదు నెయ్యిలో ముంచుకుని మ‌రీ ఇడ్లీలు తినే వాడిన‌ని కూడా చెప్పాడు ఎన్టీఆర్.

అయితే ఇదంతా ఒక‌ప్పుడు. ఇప్పుడు ఆ అల‌వాటును ఎన్టీఆర్ పూర్తిగా మానుకున్నాడు. అందుకే ఇప్పుడు తార‌క్(Tarak) అంత స్లిమ్ గా మారిపోయాడు. తిన‌డం తగ్గించేసిన ఎన్టీఆర్ త‌న ఇంటికి వ‌చ్చిన గెస్టుల‌కు మాత్రం స్వ‌యంగా తానే బిర్యానీలు వండి వారిస్తాడ‌ని అంద‌రూ చెప్తుంటారు. ఎన్టీఆర్ త‌ర్వాత ప్ర‌భాస్(Prabhas) కూడా అలానే భోజ‌న ప్రియుడు.

ప్ర‌తీ రోజూ అత‌డి మెనూలో వెజ్- నాన్ వెజ్‌లోని అన్ని ర‌కాల వంట‌కాలు ఉండాల్సిందేన‌ని అత‌నితో క‌లిసి వ‌ర్క్ చేసిన వాళ్లు చెప్తుంటారు.  వీరి త‌ర్వాత ఆ లిస్ట్ లో వేరే హీరో ఎవ‌రైనా ఉన్నారా అంటే మెగా హీరో సాయి దుర్గ తేజ్(Sai Durga Tej) పేరు వినిపిస్తోంది. హీరో కాక ముందు తాను 130 కేజీల బ‌రువుండేవాడిన‌ని, ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఒక్క‌డినే తిన‌డ‌మే దానికి కార‌ణ‌మ‌ని తేజ్ వెల్ల‌డించాడు. అయితే బ‌రువు త‌గ్గాకే తేజ్ సినిమాల్లోకి రావ‌డం వ‌ల్ల ఈ విష‌యం అంత‌గా హైలైట్ అవ‌లేదు.  

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye Radha Spaces
Tags :