ASBL Koncept Ambience
facebook whatsapp X

దేవ‌ర‌పై భారం వేసిన సైఫ్

దేవ‌ర‌పై భారం వేసిన సైఫ్

ఆదిపురుష్ సినిమాలో ఎక్కువ ట్రోల్ అయిన పాత్ర అంటే సైఫ్ అలీ ఖానీ చేసిన రావ‌ణుడు పాత్రే. ఆ పాత్ర‌ను డైరెక్ట‌ర్ ఓం రౌత్ డిజైన్ చేసిన విధానం చాలా దారుణంగా ఉండ‌టంతో తీవ్ర విమ‌ర్శ‌లొచ్చాయి. మొద‌టి ఆట‌కే ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన సైఫ్ ఆ చిత్ర ప్ర‌మోష‌న్స్ లో ఎక్క‌డా క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త పడ్డాడు.

అందుకే ఆదిపురుష్ తెలుగు సినిమా అయిన‌ప్ప‌టికీ దేవ‌ర సినిమానే త‌న టాలీవుడ్ డెబ్యూగా చెప్పుకుంటున్నాడు. ఈ సినిమాలో త‌ను న‌టించిన భైర పాత్ర‌లో ఎంతో డెప్త్ ఉంద‌ని ట్రైల‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. ఎన్టీఆర్ త‌ర్వాత సినిమాలో ఎక్కువ ప్రాధాన్య‌ముంది సైఫ్ పాత్ర‌కే. ఈ రీజ‌న్ తోనే దేవ‌ర ప్ర‌మోష‌న్స్ లో సైఫ్ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు.

టీమ్ అడిగిన చోటుక‌ల్లా వ‌చ్చి వారు చెప్పిన‌ట్లు సినిమాను ప్ర‌మోట్ చేస్తున్నాడు. రెండు భాగాలుగా వ‌స్తున్న సినిమా కావ‌డంతో అత‌ని పాత్ర నిడివి కూడా ఎక్కువే ఉండ‌నుంది. రెండు భాగాల్లోనూ సైఫ్ క‌నిపించ‌నున్నాడు. దీంతో ఆదిపురుష్ చేసిన గాయాన్ని తీర్చే భారం దేవ‌ర‌పై ప‌డింది. ఎన్టీఆర్‌లా సైఫ్ ఈ సినిమాలో డ్యూయ‌ల్ రోల్ చేయ‌క‌పోయినా రెండు షేడ్స్ లో క‌నిపిస్తాడ‌ని, అదే హైలైట్ గా ఉండ‌బోతుంద‌ని అంటున్నారు. దేవ‌ర‌లో ఎన్టీఆర్, సైఫ్ మ‌ధ్య క్లాష్ నువ్వా నేనా అనే రీతిలో కొర‌టాల డిజైన్ చేశాడ‌ని టాక్.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :