ASBL NSL Infratech

విల‌న్ వేటలో నాని

విల‌న్ వేటలో నాని

ఒక దాని త‌ర్వాత ఒక సినిమాను వెంట వెంట‌నే పూర్తి చేస్తూ సంవ‌త్స‌రానికి మినిమం రెండు సినిమాల‌ను రిలీజ్ చేసే నాని, ఈసారి స‌రిపోదా శ‌నివారం సినిమాకు కాస్త ఎక్కువ టైమే తీసుకున్నాడు. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఆగ‌స్ట్ 29న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా త‌ర్వాత నాని, సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా చేయాల్సింది కానీ ఆ సినిమా పెండింగ్ ప‌డ‌టంతో ఇప్పుడు నాని నెక్ట్స్ సినిమాల లిస్ట్ లో మార్పులొచ్చాయి. ద‌సరా డైరెక్ట‌ర్ శ్రీకాంత్ తో ఓ సినిమా చేయ‌డానికి నాని ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్, సెట్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయి.

షూటింగ్ స్టార్ట్ అవ‌డానికి ఎంత లేద‌న్నా మ‌రో నాలుగు నెలలు ప‌డుతుంది. ఈలోగా హిట్3 ను సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని నాని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ శైలేష్ హిట్3 స్క్రిప్ట్ ను ఓ దారికి తీసుకొచ్చాడ‌ట‌. హిట్3లో నాని మెంట‌ల్ మాస్ పోలీస్ గా క‌నిపించ‌నున్నాడ‌ని హిట్2 క్లైమాక్స్ లో రివీల్ చేయ‌డంతో ఈ సినిమాపై అంద‌రూ ఎన్నో అంచ‌నాల‌తో ఉన్నారు. అయితే హిట్3లో న‌టించే విల‌న్ కోసం శైలేష్ వెతుకుతున్న‌ట్లు తెలుస్తోంది. రానా ద‌గ్గుబాటికి క‌థ నెరేట్ చేశాడ‌ని కాక‌పోతే ఇంకా త‌న‌నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేద‌ని స‌మాచారం. ఈ సినిమా కోసం క్రూర‌మైన విల‌న్ కావాల‌ట‌. ఇంటెన్స్ యాక్ట‌ర్ ఉంటే త‌ప్ప ఆ క్యారెక్ట‌ర్ పండించ‌టం క‌ష్టం. రానా, అనురాగ్ క‌శ్య‌ప్, ఉపేంద్ర లాంటి వాళ్లు ఈ పాత్ర‌లు చాలా ఈజ్ తో చేయ‌గ‌ల‌రు. మ‌రి హిట్3 కోసం శైలేష్ ఎవ‌రిని తీసుకొస్తాడో చూడాలి.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :