ASBL NSL Infratech

ప్లానింగ్ తో ముందుకెళ్తున్న స‌లార్2

ప్లానింగ్ తో ముందుకెళ్తున్న స‌లార్2

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా గ‌తేడాది రిలీజైన స‌లార్ పార్ట్1 మిక్డ్స్ టాక్ తెచ్చ‌కున్న‌ప్ప‌టికీ బాక్సాఫీస్ వ‌ద్ద రూ.600 కోట్ల భారీ వ‌సూళ్ల‌తో సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. దీంతో స‌లార్2 మీద అంచ‌నాలు బాగా పెరిగాయి. దానికి తోడు అస‌లు క‌థ పార్ట్2 లోనే ఉంటుంద‌ని డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్ ప‌లు సంద‌ర్భాల్లో చెప్ప‌డం వ‌ల్ల ఆ అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.అయితే మ‌ధ్య‌లో స‌లార్2 ఉండ‌ద‌ని కొన్ని వార్త‌లొచ్చాయి కానీ అవ‌న్నీ పుకార్లేన‌ని తేలింది. తాజా స‌మాచారం ప్ర‌కారం స‌లార్2 ఆగస్ట్ 10 నుంచి సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. అందుకోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నార‌ని స‌మాచారం. 8 నెలల్లో సినిమాను పూర్తి చేయాల‌నే విధంగా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే స‌లార్2 కు సంబంధించి 20% షూటింగ్ పూర్త‌యింది. మిగిలిన షూటింగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీలోని సెట్స్ లో పూర్తి చేయ‌నున్నార‌ట‌. ఎన్టీఆర్ తో చేయ‌బోయే సినిమాకు స‌మాంత‌రంగా ఎలాంటి స‌మ‌స్యా రాకుండా రెండింటినీ పూర్తి చేస్తాన‌ని నీల్ ఇప్ప‌టికే మైత్రీ నిర్మాత‌ల‌కు హామీ ఇచ్చాడ‌ట‌. క‌ల్కి సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ‌డంతో స‌లార్2 కు పై అంచ‌నాలు తారాస్థాయికి చేర‌తాయి. ప్ర‌స్తుతం రాజా సాబ్ ను పూర్తి చేసే ప‌నిలో ఉన్న ప్ర‌భాస్ ఆ త‌ర్వాత స‌లార్2ని మొద‌లు పెడ‌తాడ‌ని అంటున్నారు. ఈసారి స‌లార్2 కు బ‌డ్జెట్ కూడా మొద‌టి భాగానికంటే రెట్టింపు చేస్తార‌ని తెలుస్తోంది.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :